Telangana News: షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం - రూ.10 కోట్ల ఆస్తి నష్టం!
Kamareddy Fire Accident: కామారెడ్డిలోని ఓ షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.10 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Fire Accident in Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్ (Ayyappa Shopping Mall)లో బుధవారం రాత్రి 11:30 గంటలకు భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. మంటలు క్రమంగా మాల్ నాలుగంతస్తులకు వ్యాపించాయి. దట్టంగా పొగలు అలుముకోగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో శ్రమించి మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. జేసీబీ సాయంతో షాపింగ్ మాల్ షట్టర్లను తొలగించి మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయం వరకూ 2 అంతస్తుల్లో మంటలు అదుపులోకి తెచ్చారు. మిగిలిన 2 అంతస్తుల్లో అగ్ని కీలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దుకాణంలో వస్త్రాలు, సామగ్రి కాలి బూడిదయ్యాయి. ఆస్తి నష్టం రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Also Read: Weather Latest Update: తెలంగాణలో దిగజారుతున్న ఉష్ణోగ్రతలు, ఏపీకి స్వల్ప వర్ష సూచన - ఐఎండీ అలర్ట్!