Air India Delhi-Sydney Flight: ఉన్నట్టుండి ఊగిపోయిన విమానం, ప్రయాణికులకు ముచ్చెమటలు - పలువురికి గాయాలు
Air India Delhi-Sydney Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్ గాల్లో ఉండగానే భారీ కుదుపులకు లోనైంది.

Air India Delhi-Sydney Flight:
ఢిల్లీ-సిడ్నీ ఫ్లైట్‌లో..
ఢిల్లీ-సిడ్నీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ గాల్లో ఉండగానే ఒక్కసారిగా కుదుపులకు గురైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే సమయానికే...మెడికల్ అసిస్టెన్స్ సిద్ధంగా ఉంచారు. ఎవరినీ ఆసుపత్రిలో చేర్చాల్సినంత తీవ్రంగా గాయాలు కాలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పష్టం చేసింది.
"Air India B787-800 ఎయిర్‌క్రాఫ్ట్ గాల్లో ఉండగానే భారీ కుదుపులకు లోనైంది. దాదాపు ఏడుగురు ప్రయాణికులు ఈ ప్రమాదంలో స్పల్పంగా గాయపడ్డారు. ఫ్లైట్‌లో ఉండగానే వాళ్లకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఓ డాక్టర్‌తో పాటు నర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో వాళ్లకు చికిత్స చేశారు"
- డీజీసీఏ
గాయాలు తీవ్రంగా కాకపోయినా చాలా చోట్ల దెబ్బలు తాకినట్టు అధికారులు వెల్లడించారు. తీవ్రస్థాయిలో కుదుపులకు లోనవడం వల్లే ఇలా జరిగిందని వివరించారు. అయితే..ఇప్పటి వరకూ ఎయిర్ ఇండియా మాత్రం ఈ ఘటనపై స్పందించలేదు. ఈ మధ్య కాలంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్లు ఇలా ఏదో ఓ ప్రమాదానికి గురవుతున్నాయి. ప్రయాణికులను టెన్షన్ పెడుతున్నాయి.
Several passengers on board the Delhi-Sydney Air India flight were injured after the flight encountered severe turbulence mid-air on Tuesday. The injured passengers received medical assistance on arrival at Sydney airport, no passenger was hospitalised. pic.twitter.com/kskVFZfIun
— ANI (@ANI) May 17, 2023
వరుస ఘటనలు..
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఇటీవలో మరో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. నాగ్‌పూర్ నుంచి ముంబయికి వెళ్తున్న ఫ్లైట్‌లో ఓ మహిళను తేలు కరిచింది. గత నెల జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ల్యాండ్ అయిన వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం వల్ల ప్రాణాపాయం తప్పిందని అధికారులు వెల్లడించారు. డిశ్ఛార్జ్ కూడా చేశారని తెలిపారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ సంఘటన జరిగిందని ఎయిర్ ఇండియా వివరించింది. ఇలా జరగటం చాలా దురదృష్టకరమని తెలిపింది. ఇది జరిగిన వెంటనే ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఫ్లైట్ మొత్తం తనిఖీలు చేసింది. ప్రోటోకాల్ ఆధారంగా ఇన్స్పెక్ట్ చేసి తేలుని గుర్తించి బయటకు తీసింది. తేలుతో పాటు నల్లులు కూడా ఉన్నట్టు అనుమానించిన అధికారులు క్యాటరింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు. డ్రై క్లీనర్స్‌తో అన్ని సీట్లనూ చెక్ చేశారు. ఇప్పుడే కాదు. గతంలోనూ ఫ్లైట్లలో ఇలా తేళ్లు, పాములు కనిపించడం కలకలం రేపింది. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) కార్గోలో పాము కనిపించడం కలకలం రేపింది. కాలికట్ నుంచి దుబాయ్‌కు వెళ్లిన ఫ్లైట్‌లోని కార్గోలో సిబ్బందికి పాము కనిపించింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాక...కార్గోలో పాము కనిపించడం వల్ల సిబ్బంది కాస్త కంగారు పడ్డారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపిన తరవాత అగ్నిమాపక సిబ్బందికి ఈ విషయం తెలియజేశారు.
Also Read: Chain Snatchers: చైన్ స్నాచర్స్ అరాచకం,మహిళను రోడ్డుపై లాక్కెళ్తూ చోరీకి యత్నం





















