అన్వేషించండి

IT Raids: బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు - రెండో రోజూ కొనసాగుతోన్న సోదాలు!

గత రెండు రోజులుగా బిఆర్ఎస్ పార్టీకు చెందిన ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

IT Raids In Telangana : ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత రెండు రోజులుగా బిఆర్ఎస్ పార్టీకు చెందిన ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. భువనగిరికి చెందిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అలాగే నాగర్ కర్నూల్ కు చెందిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు నిర్వహిస్తోన్న సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో ఉన్న మర్రి జనార్దన్ నివాసానికి భారీగా అనుచరులు చేరుకుంటున్నారు. 

పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో విస్తృతంగా సోదాలు..

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. దక్షిణాఫ్రికాలో మైనింగ్‌ వ్యాపారాన్ని శేఖర్‌ రెడ్డి సంస్థలు నిర్వహిస్తున్నాయి. హిల్‌ల్యాండ్‌ టెక్నాలజీస్‌ కంపెనీ, మెయిన్‌ ల్యాండ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ లో  ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు కంపెనీలకు కూడా శేఖర్ రెడ్డి భార్య వనితి డెరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న తీర్థ గ్రూప్‌ సంస్థలో కూడా సోదాలు చేపట్టారు. ఒకేసారి 12 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 

మర్రి జనార్ధన్ రెడ్డి నివాసాలలో కూడా..

నాగర్ కర్నూల్ కు చెందిన ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కూకట్ పల్లిలో ఎమ్మెల్యేకు చెందిన కార్యాలయాలు, గోదాములతో పాటు జేసీ బ్రదర్స్ మాల్స్ లోనూ ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. జనార్ధన్ రెడ్డి వ్యాపారాలతో సంబంధమున్న బంధువులు, సిబ్బంది నివాసాలపై కూడా సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి నివాసముంటున్న విల్లాతోపాటు ఆయన ఛైర్మన్‌ గా కొనసాగుతున్న సోనీ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సంస్థ కార్యాలయాలపైన కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులకు సంబంధించిన స్థిరాస్తులు, వ్యాపారాలు, హోటల్స్, మాల్స్ ఇతర సంస్థలపై దాడులు నిర్వహించారు.  

బుధవారం(జూన్ 14) ఉదయం నుంచి జరుగుతున్న ఈ సోదాల్లో దాదాపు యాభై బృందాలు పాల్గొన్నట్లు ఐటీ అధికారులు చెప్తున్నారు. ఈ ముగ్గురు నేతలు సంబంధించిన వ్యాపార లావాదేవీలు, చెల్లిస్తున్న ఆదాయ పన్నుల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారట. ఆ మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఐటీ సోదాల పట్ల బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ ను నేరుగా ఎదుర్కోలేక బిజేపీ ఇలా సోదాలు చేస్తుందంటూ విమర్శిస్తున్నారు. ఎన్నికల వేళ ఇలాంటి దాడులు సహజమే అని ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమే అన్ని మండిపడుతున్నారట గులాబీ నేతలు. గతంలో కూడా బీఆర్ఎస్ నేతలు మంత్రి మల్లారెడ్డి అలాగే మంత్రి గంగుల కమలాకర్‌, బీఆర్‌ఎస్‌ ఎంపీ గాయత్రి రవి ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget