News
News
X

Cheetahs in India: సౌతాఫ్రికా నుంచి భారత్‌కు మరో 12 చీతాలు, ఇకపై ఏటా దిగుమతి

Cheetahs in India: భారత్‌కు మరో 12 చీతాలు సౌతాఫ్రికా నుంచి రానున్నాయి.

FOLLOW US: 
Share:

Cheetahs in India:

12 చీతాలు..

సౌతాఫ్రికా నుంచి మరో 12 చీతాలు భారత్‌కు రానున్నాయి. ఈ నెల 18వ తేదీన ఇండియాకు వస్తాయని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. Cheetah Reintroduction Programmeలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి ఇప్పటికే 8 చీతాలను తెప్పించింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. అక్కడి వాతావరణానికి అవి అలవాటు పడ్డాక ఒక్కొక్క చీతాను బయటకు వదులుతున్నారు. ప్రస్తుతం ఈ 8 చీతాలు ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పుడు మరో 12 చీతాలను సౌతాఫ్రికా నుంచి రానున్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా,భారత్ మధ్య ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. సౌతాఫ్రికా, నమీబియా, బోత్స్‌వానాలో దాదాపు 7 వేల చీతాలున్నట్టు అంచనా. వీటిలో నమీబియాలోనే అత్యధికంగా చీతాలున్నాయి. భారత్‌లో పూర్తిగా ఇవి అంతరించిపోవడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి తెప్పిస్తోంది కేంద్రం. చివరి సారిగా భారత్‌లో 1948లో ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో సల్ అడవుల్లో కనిపించింది. అందుకే వీటి సంఖ్య పెంచాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. 

"ఫిబ్రవరి 18న సౌతాఫ్రికా నుంచి 12 చీతాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటి నుంచి ఏటా 12 చీతాలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదేళ్ల పాటు ఇదే కొనసాగుతుంది. ఆ దేశంతో కుదిరిన ఒప్పందాన్ని ప్రతి ఐదేళ్లకోసారి రివ్యూ చేసుకుంటాం. అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తాం" 

-భూపేందర్ యాదవ్, కేంద్ర పర్యావరణ మంత్రి 

సంరక్షణ

నమీబియా నుంచి వచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో సంరక్షిస్తున్నారు. వీటిని కాపాడుకునేందుకు గట్టి చర్యలే చేపడుతోంది కేంద్రం. ప్రస్తుతం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 9 మంది సభ్యులతో కూడిన ఓ టాస్క్‌ఫోర్స్‌ని నియమించింది. చీతాలను సరైన విధంగా సంరక్షించుకునే బాధ్యతల్ని...ఈ టాస్క్‌ఫోర్స్ తీసుకోనుంది. చీతాల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం, క్వారంటైన్‌లో ఎలా ఉంటున్నాయో పరిశీలించడం, చీతాలకు అనుకూలమైన వాతావరణం సృష్టించటం లాంటివి చేయనున్నారు. దాదాపు 7 దశాబ్దాల తరవాత చీతాలు భారత్‌కు తిరిగి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వాటిని అధికారికంగా వదిలారు. వాటిని సంరక్షించి అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మొదటి విజయం. రీఇంట్రడక్షన్ ఆఫ్ యానిమల్స్ (Reintroduction of Animals)లో భాగంగా భారత్‌ ఇలా చీతాలను నమీబియా నుంచి తెప్పించింది. 1930ల్లో చీతాలను వేటాడటం ఓ స్టేటస్ సింబల్‌గా భావించేవారు. అందుకే...లేదంటే వాటిని పెంచుకుని వాటితో వేరే జంతువులను వేటాడించేవారు. మనం కుక్కల్ని పెంచుకున్నట్టుగా... అప్పట్లో చీతాలను పెంచుకునే వారు. నిజానికి...చీతాలకు, మనుషులకు మధ్య కాన్‌ఫ్లిక్ట్ చాలా తక్కువగా ఉండేదట. చాలా మంది వాటిని "Hunting leopards" గా పిలిచేవారు. వేట కోసం వీటిని ఎక్కువగా వినియోగించేవారు. చీతాలు మాత్రమే కాదు. కాస్త ప్రత్యేకం అనిపించే జంతువులన్నింటినీ అప్పటి రాజులు, బ్రిటీషర్లు వేటాడేవారు. అదిగో అలా మొదలైన వేట..క్రమంగా చీతాల సంఖ్యపై ప్రభావం చూపింది. 

Also Read: Bhagwant Mann Photo: సీఎం ఫోటోని ఎత్తుకెళ్లిన దుండగులు, వెతుకులాటలో పోలీసులు

Published at : 16 Feb 2023 02:21 PM (IST) Tags: India Cheetahs South Africa Cheetahs from SA

సంబంధిత కథనాలు

Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం

Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం

MP Laxman: బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.20 తగ్గిస్తే, కేసీఆర్ రూ.5 కూడా తగ్గించలేదు: ఎంపీ లక్ష్మణ్

MP Laxman: బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.20 తగ్గిస్తే, కేసీఆర్ రూ.5 కూడా తగ్గించలేదు: ఎంపీ లక్ష్మణ్

Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య

Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య

Tirupati News: వరదయ్యపాలెం అంగన్వాడీ కేంద్రానికి తాళం - సీడీపీఓ వచ్చే వరకు తెరవనంటున్న టీచర్ 

Tirupati News: వరదయ్యపాలెం అంగన్వాడీ కేంద్రానికి తాళం - సీడీపీఓ వచ్చే వరకు తెరవనంటున్న టీచర్ 

TSNPDCL: ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!

TSNPDCL: ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

AP News  :  ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...