మగవాళ్లకు గుడ్ న్యూస్, వై క్రోమోజోమ్‌ల గుట్టు కనిపెట్టిన సైంటిస్ట్‌లు - ఇక ఆ సమస్య తీరినట్టే!
Y Chromosome: వై క్రోమోజోమ్ సీక్వెన్సింగ్‌ని సైంటిస్ట్‌లు ఇన్నాళ్లకు పూర్తి చేశారు.
Y Chromosome:
వై క్రోమోజోమ్స్ సీక్వెన్సింగ్..
ఎన్నో ఏళ్లుగా Y Chromosomes గుట్టు విప్పాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లకు తొలిసారి ఈ ప్రయత్నం సక్సెస్ అయింది. పూర్తి స్థాయిలో ఈ క్రోమోజోమ్‌ని సీక్వెన్సింగ్ చేశారు సైంటిస్ట్‌లు. ఇందులోని మిస్టరీని డీకోడ్ చేశారు. పురుషుల్లో సంతానలేమికి ఎన్నో కారణాలేంటో ఈ సీక్వెన్సింగ్ ద్వారా పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు అవకాశముంటుంది. వీటితో పాటు అనారోగ్య సమస్యలపైనా అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. నిజానికి వై క్రోమోజోమ్‌పై పరిశోధనలు 6 దశాబ్దాల క్రితమే మొదలయ్యాయి. ఈ క్రమంలో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. ఇన్నేళ్ల తరవాత Telomere-to-Telomere (T2T) కన్సార్టియమ్‌కి చెందిన 100 మంది శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి ఈ సీక్వెన్సింగ్ చేపట్టారు. జెనెటిక్ కోడ్‌లోని బిల్డింగ్ బ్లాక్స్ గురించి 20 ఏళ్ల క్రితం కొన్ని కీలక వివరాలు తెలిశాయి. అయితే...అప్పటికీ ఈ సీక్వెన్స్‌లో బ్లాంక్స్ కనిపించాయి. గతేడాది ఈ బ్లాంక్స్‌ని ఫిల్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికి అది పూర్తైంది. ఫలితంగా...పూర్తి స్థాయిలో సీక్వెన్సింగ్ వీలైంది. వై క్రోమోజోమ్‌లోని సగానికిపై సీక్వెన్స్‌ల గురించి ఇంకా తెలియాల్సి చాలా ఉంది. ఏడాది క్రితం వరకూ గుట్టు చెప్పలేకపోయారు సైంటిస్ట్‌లు. ప్రస్తుతం ఈ గుట్టుని తేల్చారు. ఇప్పుడు వై క్రోమోజోమ్‌కి సంబంధించిన పూర్తి జెనెటిక్ కోడ్ తెలిసిపోయింది. ఈ సీక్వెన్సింగ్ వివరాలను Nature అనే జర్నల్‌లో ప్రచురించారు.
చాలా కీలకం..
సాధారణంగా మనుషుల్లో 23 జతల క్రోమోజోమ్‌లుంటాయి. అంటే మొత్తం 46. మిగతా వాటితో పోల్చి చూస్తే X,Y క్రోమోజోమ్‌లు చాలా భిన్నంగా ఉంటాయి. ఎప్పుడైతే X,Y క్రోమోజోమ్‌లు కలుస్తాయో...అప్పుడు మగ శిశువు జన్మిస్తాడు. రెండు X క్రోమోజోమ్‌లు కలిస్తే ఆడ శిశువు జన్మిస్తుంది. ఆడవాళ్లలో రెండు X క్రోమోజోమ్‌లు మాత్రమే ఉంటాయి. ఈ రెండు క్రోమోజోమ్‌లలో Y మరింత భిన్నం. దీని గురించి తెలుసుకోవడానికి సైంటిస్ట్‌లు నానా తంటాలు పడ్డారు. కొన్నేళ్లుగా తనను తాను మార్చుకుంటూ సవాలు విసురుతోంది ఈ క్రోమోజోమ్. X క్రోమోజోమ్‌తో పోల్చి చూస్తే...Y క్రోమోజోమ్‌లో ప్రోటీన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. మూడేళ్ల క్రితం X క్రోమోజోమ్ సీక్వెన్సింగ్ పూర్తైంది. కానీ వై క్రోమోజోమో విషయంలో ఈ టెక్నాలజీ పనికి రాలేదు. అందుకే ఈ సీక్వెన్సింగ్‌కి ఇన్నాళ్ల సమయం పట్టింది. మరి Y క్రోమోజోమ్ సీక్వెన్సింగ్‌పై శాస్త్రవేత్తలు ఇంతగా పట్టుపట్టడానికి కారణం..దానితో ఉన్న ప్రయోజనాలే. ఈ క్రోమోజోమ్‌ల లోపం వల్ల పురుషులు అనారోగ్యానికి గురవుతున్నారు. మరి కొందరు వ్యంధత్వంతో బాధ పడుతున్నారు. ఆరోగ్యపరంగా చూసినా ఇదెంతో కీలకం. పైగా క్యాన్సర్‌ని నివారించే జన్యువులు ఈ వై క్రోమోజోమ్‌లో ఉంటాయి. అందుకే...దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం అవసరం అని భావించారు శాస్త్రవేత్తలు. మొత్తంగా చూస్తే ఈ వై క్రోమోజోమ్‌లో 106 ప్రోటీన్ కోడింగ్ జీన్స్ ఉన్నట్టు గుర్తించారు. వీటిలో 42 జీన్స్‌ని కొత్తగా కనుగొన్నారు. ఎక్కువ రోజులు బతకాలన్నా ఈ క్రోమోజోమ్‌ల గుట్టు తెలుసుకోవడం ఎంతో అవసరం.