Viral News: క్లాస్‌మేట్‌ను రేప్ చేసి చంపాలని ఫ్రెండ్‌కు వంద సుపారీ ఇచ్చిన 3వ తరగతి బాలుడు - ఓటీటీ ఎఫెక్టేనా ?
Pune: పట్టుమని పదేళ్లు కూడా ఉండవు. కానీ తన క్లాస్ మేట్ ను రేప్ చేసి చంపాలని మరో పిల్లవాడికి వంద ఇచ్చాడు ఓ బాలుడు. ఆ ఘోరం జరగలేదు కానీ దీన్ని కవర్ చేసిన టీచర్లపై మాత్రం కేసు నమోదు అయింది.

School Boy Pays INR 100 As Supari to Friend To Rape and Kill Girl Student Who Complained Against Him: ఓటీటీ ఎఫెక్ట్ పేరుతో పిల్లలు కూడా బూతులు మాట్లాడుతున్నారంటూ.. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల్లో చూశాం. కానీ నేటి పిల్లలు ఆ బూతుల రేంజ్ నుంచి ఇంకా చాలా ముందుకు వెళ్లిపోయారు. చివరికి తన గురించి టీచర్ కు కంప్లైంట్ చేసిందని క్లాస్ మేట్ ను రేప్.. హత్య చేయాలని తన కంటే ముందు ఉన్న తరగతి విద్యార్థికి వంద రూపాయలు సుపారీ కూడా ఇచ్చాడు. అసలు రేప్ అంటే. మర్డర్ అంటే ఏమిటో పూర్తి తెలియని వయసు వారిది. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో కానీ.. ఈ విషయం బయటకు తెలియడం సంచలనంగా మారింది.
పుణెలో సెబాస్టియన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఉంది. ఈ స్కూల్‌లో మూడో తరగతి చదివే ఓ బాలుడు డైరీలో తల్లిదండ్రుల సంతకాలను తానే పెట్టి టీచర్ కు ఇస్తున్నాడు. ఇలా ఓ రోజు క్లాసులోనే ఇలా సంతకం పెడుతూంటే క్లాస్ మేట్ అయిన ఓ బాలిక చూసింది. టీచర్ రాగానే ఆ సంతకం ఆ బాలుడు తల్లి పెట్టలేదని అతడే పెట్టాడని కంప్లైంట్ చేసింది. దీంతో టీచర్ ఆ పిల్లవాడ్ని మందలించింది. దీన్న అవమానంగా భావించిన ఆ బాలుడు .. రెండో తరగతి చదువుతున్న ఓ పిల్లవాడ్ని సంప్రదించి.. తనపై ఫిర్యాదు చేసిన క్లాస్ మేట్ ను రేప్ చేసి చంపేయాలని చెప్పి వంద రూపాయలు సుపారీ ఇచ్చాడు.
ఆ రెండో తరగతి పిల్లవాడికి సుపారీ అన్నా.. రేప్ అన్నా.. మర్డర్ అన్నా ఏంటో అర్థం కాలేదు కానీ.. ఆ వంద రూపాయుల తీసుకుని అందరికీ చెప్పుకోవడం ప్రారంభించాడు. ఆ నోటా.. ఈ నోటా పడి టీచర్లకు తెలిసింది. టీచర్లు ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం బయట పడితే స్కూల్ పరువు పోతుందని ప్రిన్సిపాల్ సైలెంట్ గా ఉన్నారు. అయితే విషయం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు ఈ విషయం దాచి పెట్టినందుకు పోలీసులు కేసులు పెట్టారు. ప్రన్సిపాల్ తో పాటు స్కూల్ కు చెందిన ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.
ఈ వ్యవహారంలో ఉన్న పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చేలా తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు. వారు ఇంకా మూడు, రెండు తరగతుల్లోనే ఉన్నారు. పని గట్టుకుని ప్రతీకారం తీర్చుకోవాలని అది కూడా.. రేప్, హత్య వంటి వాటిని చేయాలని సుపారీ ఇవ్వడం సంచలనంగా మారింది. వారికి ఇలాంటి విషయాలు సోషల్ మీడియాలు.. ఓటీటీ ద్వారానే తెలుస్తూంటాయని.. వాటిని నియంత్రించకపోతే సమాజం కాలుష్యం అయిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read: డిజిటల్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం - చేసిందో ఎవరో కాదు బ్యాంక్ మేనేజర్లే - ఇంకెవర్ని నమ్మాలి ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

