అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
17 th August 2024 News Headlines: అమరావతిలో మరో విశ్వవిద్యాలయం ఏర్పాటు, నేడు దేశవ్యాప్తంగా నిలచిపోనున్న వైద్య సేవలు వంటి మార్నింగ్ టాప్ న్యూస్
17 th August 2024 School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.
17 th August 2024 School News Headlines Today:
నేటి ప్రత్యేకత:
- ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం
- గాబన్ స్వాతంత్ర్య దినోత్సవం
ఆంధ్రప్రదేశ్ వార్తలు:
- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. బీసీఐ అధ్యక్షుడు మన్నన్ కుమార్.. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబుతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళిక రూపొందించేందుకు.. సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, నిపుణులకు ఇందులో ఈ టాస్క్‌ఫోర్స్‌లో అవకాశం కల్పించనున్నారు. ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు, కో-ఛైర్మన్‌గా టాటా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఉంటారు.
- ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నేడు(వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పల్నాడు, కర్నూలు, నంద్యాల, అల్లూరి, ఏలూరు, కృష్ణా, మన్యం, NTR, గుంటూరు జిల్లాలో వర్షాలు పడనున్నాయి.
తెలంగాణ న్యూస్ :
- తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూతో కీలక చర్చలు జరిపారు. ఫ్యూచర్ సిటీ’లో పెట్టుబడులు యంగ్ లియూను ఆహ్వానించారు. ఫాక్స్‌కాన్ సంస్థకు అండగా ఉంటామని.. అవసరమైన అన్ని అనుమతులు ఇస్తామని రేవంత్ తెలిపారు.
- తెలంగాణలో త్వరలోనే స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నామని రేవంత్ తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రను, వైస్‌ఛైర్మన్‌గా శ్రీనివాసరాజును నియమించామన్నారు. ఈ యూనివర్సిటీతో మానవ వనరుల కొరత అధిగమిస్తామన్నారు.
జాతీయ వార్తలు :
- దేశవ్యాప్తంగా నేడు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు వైద్య సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
- బంగ్లాలో మైనారిటీలు, హిందువులపై దాడుల జరుగుతున్న వేళ ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని మహమ్మద్ యూనస్ ఫోన్ చేశారు. తమ దేశంలోని హిందువులకు రక్షణ కల్పిస్తామని యూనస్ హామీ ఇచ్చారని మోదీ వెల్లడించారు. ప్రజాస్వామ్యం, సుస్థిరత, శాంతియుత, ప్రగతిశీల ప్రభుత్వానికి భారత్ మద్దతు ఉంటుందని మోదీ తెలిపారు.
అంతర్జాతీయ వార్తలు :
- ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ మహమ్మారి కలకలం రేపుతోంది. తాజాగా పాకిస్తాన్‌లో ముగ్గురు వ్యక్తులకు మంకీ పాక్స్ సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సౌది అరేబియా నుంచి వచ్చిన ముగ్గురికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
- థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా పేటోంగ్టార్న్ ఎన్నికయ్యారు. ఫ్యూ థాయ్ పార్టీ నేతలు, సంకీర్ణ భాగస్వాములు గురువారం ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. తాజాగా పార్లమెంటరీ ఓటింగ్‌లో అత్యధిక ఓట్లు రావడంతో ఆమె ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్నారు.
మంచిమాట
-
నిన్ను నువ్వే కించపరుచుకుంటూ ఎదుటివాళ్లు గౌరవించాలని ఆశించడం దురాశ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
విశాఖపట్నం
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement