అన్వేషించండి

Miss Universe 2024: మిస్ యూనివర్స్ పోటీలోకి సౌదీ అరేబియా, చరిత్రలోనే ఇది తొలిసారి

Miss Universe 2024: ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియా తొలిసారి పాల్గొననుంది.

Miss Universe Event 2024: ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ పోటీలో సౌదీ పోటీ చేయడం ఇదే తొలిసారి. మెక్సికోలో సెప్టెంబర్ 18వ తేదీన Miss Universe 2024 పోటీలో సౌదీకి చెందిన 27 ఏళ్ల మోడల్ రూమీ అల్ఖాతానీ పాల్గొననుంది. ఆమే స్వయంగా ఈ విషయం వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పోస్ట్ పెట్టింది. "మిస్ యూనివర్స్ 2024 పోటీలో పాల్గొంటుండడం చాలా ఆనందంగా ఉంది. ఈ పోటీలో సౌదీ అరేబియా పాల్గొనడం ఇదే తొలిసారి" అని పోస్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడల్స్‌కి సరైన అవకాశాలు చూపించాలనే థీమ్‌తో ఈ సారి పోటీలు నిర్వహించనున్నారు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by rumy alqahtani | رومي القحطاني 🇸🇦 (@rumy_alqahtani)

ఎవరీ సుందరి..?

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో పుట్టి పెరిగింది రూమీ అల్ఖాతానీ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొంది. ఇటీవల మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్ (Miss and Mrs Global Asian) ఈవెంట్‌లో పోటీ చేసింది. ప్రపంచ దేశాల సంస్కృతుల గురించి తెలుసుకోవడంతో పాటు సౌదీ అరేబియా సంస్కృతిని మిగతా దేశాలకు తెలియజేసేందుకు ఈ పోటీల్ని వేదికగా మార్చుకుంటున్నట్టు రూమీ చెబుతోంది. మిస్ సౌదీ అరేబియా, మిస్ మిడిల్ ఈస్ట్ సౌదీ అరేబియా (Miss Middle East Saudi Arabia), Miss Arab World Peace 2021 తో పాటు Miss Woman Saudi Arabia కిరీటాల్ని గెలుచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రూమీకి 10 లక్షల మంది, ట్విటర్‌లో 2 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. Miss Universe 2023 పోటీలో మిస్ నికరగువా (Miss Nicaragua) కిరీటాన్ని గెలుచుకుంది.

సౌదీలో ఊహించని మార్పులు..

సంప్రదాయాలు, సంస్కృతి పేరుతో చాలా మటుకు తనకు తానే గీరి గీసుకున్న సౌదీ అరేబియా ఇప్పుడిప్పుడే మారిపోతోంది. ముఖ్యంగా మహమ్మద్ బిన్ సల్మాన్‌ (Mohammed Bin Salman) యువరాజుగా బాధ్యతలు తీసుకున్నాక ఈ మార్పు మొదలైంది. వేషధారణలో పూర్తిగా సంప్రదాయాన్ని అనుసరిస్తున్న బిన్ సల్మాన్...రూల్స్ విషయంలో మాత్రం కాస్త పట్టువిడుపుగానే ఉంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆంక్షల్ని పక్కన పెడుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా సౌదీ గురించి చర్చ జరుగుతోంది. మహిళల విషయంలో వస్తున్న మార్పులే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. వాళ్లపై ఇన్నాళ్లు ఉన్న ఆంక్షల్ని తొలగించారు మహమ్మద్ బిన్ సల్మాన్. వాళ్లూ డ్రైవింగ్ చేసేందుకు అనుమతినిచ్చారు. మగవాళ్లు, ఆడవాళ్లు కలిసి ఫంక్షన్‌లలో పాల్గొనేందుకూ ఓకే చెప్పారు.

Also Read: Cash in Washing Machine: వాషింగ్ మెషీన్‌లో నోట్ల కట్టలు, షాక్ అయిన ఈడీ అధికారులు

టాప్ హెడ్ లైన్స్

Mohammed Siraj Comeback:  రెండోటెస్టుకు ముందు టీమిండియాలో కీలక మార్పు..!! యువ పేసర్‌పై వేటు వేసి సిరాజ్‌కు ఛాన్స్? డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే...
రెండోటెస్టుకు ముందు టీమిండియాలో కీలక మార్పు..!! యువ పేసర్‌పై వేటు వేసి సిరాజ్‌కు ఛాన్స్? డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే...
CM Revanth Reddy: 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
0 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
Ralayaseema Lift Scheme: రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు.. సీఎం చంద్రబాబు మౌనం ఎందుకు? - వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు.. సీఎం చంద్రబాబు మౌనం ఎందుకు? - వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
Embed widget