(Source: ECI/ABP News/ABP Majha)
Satyendar Jain Viral Video: జైల్లోనూ విలాసవంతమైన జీవితం, మసాజ్ చేయించుకుంటున్న ఆప్ నేత - వీడియో వైరల్
Satyendar Jain Viral Video: ఆప్ నేత సత్యేంద్ర జైన్ జైల్లో మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.
Satyendar Jain Viral Video:
కాళ్లకు మసాజ్...
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఆప్ నేత సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సంచలనమైంది. బెడ్‌పై పడుకుని ఉండగా...ఓ వ్యక్తి ఆయన కాళ్ల దగ్గర కూర్చుని మసాజ్ చేస్తూ కనిపించాడు. జైల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని కొన్ని రోజులుగా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడీ వీడియోతో అది నిజమైన రుజువైంది. ఇప్పటికే ఈడీ ఆయనకు వీఐపీ ట్రీట్‌మెంట్ లభిస్తోందని ఆరోపిస్తోంది. ఈ మేరకు కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఆయన జైల్లో చాలా విలాసంగా గడుపుతున్నారని అందులో పేర్కొంది. మసాజ్ కూడా చేయించుకుంటున్నాడని తెలిపింది. ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే ఇప్పుడు సీసీటీవీ విజువల్స్ బయటకు వచ్చాయి. సత్యేంద్ర జైన్‌కు అక్కడి సిబ్బంది అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని...ఫుడ్, వాటర్ బయట నుంచి స్పెషల్‌గా తెప్పిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ప్రత్యేకంగా మినరల్ వాటర్ తెప్పించుకుంటున్నట్టూ చెబుతున్నారు. ఈ వీడియోలో మినరల్ వాటర్ బాటిల్స్ కూడా కనిపించడం వల్ల అది కూడా నిజమని తేలింది. దీనిపై ఇప్పటికే రాజకీయాలు మొదలయ్యాయి. బీజేపీ...ఆప్‌పై డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టింది. ఆప్ మంత్రులెవరూ జైల్లో శిక్ష అనుభవించడం లేదని, అందుకు బదులు చాలా విలాసంగా, సంతోషంగా గడుపుతున్నారని మండి పడింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. జైలుకు వెళ్లి మరీ సత్యేంద్ర జైన్‌ను కలవడానికి వచ్చిందెవరో కనుక్కోవాలని, ఆయన చేతిలో ఉన్న ఫైల్స్ వివరాలనూ బయట పెట్టాలని గట్టిగా అడుగుతోంది. ఇప్పుడిప్పుడే ఆప్ నేతల నిజస్వరూపాలు బయటకు వస్తున్నాయని చెబుతోంది.
#WATCH | CCTV video emerges of jailed Delhi minister Satyendar Jain getting a massage inside Tihar jail. pic.twitter.com/VMi8175Gag
— ANI (@ANI) November 19, 2022
జైన్‌పై ఆరోపణలు..
రూ.200 కోట్ల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్.. దిల్లీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశాడు. జైల్లో రక్షణ కల్పిస్తానంటూ దిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ తన నుంచి బలవంతంగా రూ.10 కోట్లు వసూలు చేశారని సుకేశ్ ఆరోపించాడు. ఈ మేరకు దిల్లీ లెఫ్టిసుకేశ్ చంద్రశేఖర్ దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి జాక్వెలిన్ లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించింది ఈడీ. సుఖేశ్ చంద్రశేఖర్ దోపిడీదారు అని జాక్వెలిన్‌కు ముందే తెలుసని అయినప్పటికీ అతనితో స్నేహంగా ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. నెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశాడు. ఆమ్‌ఆద్మీ దక్షిణాదిలో విస్తరించిన తర్వాత తనకు కీలక పదివి ఇస్తానని పార్టీ నేతలు చెప్పినట్లు సుకేశ్ ఆరోపించాడు. ఇందు కోసం తన నుంచి రూ.50 కోట్ల వరకు వసూలు చేసినట్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు. డబ్బు తీసుకుని ప్రస్తుతన తనను సత్యేంద్ర జైన్ బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. ఇటీవల ఈడీ దర్యాప్తులో దీని గురించి తాను అధికారులకు చెప్పినట్లు సుకేశ్ పేర్కొన్నాడు. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు తెలిపాడు.
Also Read: Political Attacks : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న అసహన రాజకీయం !