Russia Ukraine War: 'ఇది ట్రైలర్ మాత్రమే- మా జోలికి వస్తే రియాక్షన్ తీవ్రంగా ఉంటుంది'
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన తాజా దాడులపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు.
Russia Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సోమవారం మిసైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. రష్యాకు సంబంధించిన ఆస్తులపై దాడులకు దిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఉక్రెయిన్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Long-range missiles struck Ukraine's energy, military& communications facilities today. In event of further attempts to carry out terrorist acts on our territory,Russia's response will be harsh; responses will be of same scale as threats to Russia,says Russian Pres Putin: Reuters
— ANI (@ANI) October 10, 2022
బాంబుల మోత
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సోమవారం బాంబుల మోతతో దద్దరిల్లింది. రష్యా మిసైల్స్ ప్రయోగించిన ఘటనలో కనీసం 8 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ పేలుడులో 24 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారి BNO న్యూస్‌కు తెలిపారు.
కీవ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు జరిగాయి. భారీ శబ్దంతో కీవ్‌లో పేలుళ్లు సంభవించినట్లు AP న్యూస్ తెలిపింది. ఎంతమంది మృతి చెందారనే విషయంపై ఇంకా స్పష్టత లేదని పేర్కొంది.
ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతంలోని ఎల్వివ్, టెర్నోపిల్, జైటోమిర్, సెంట్రల్ ఉక్రెయిన్‌లోని డ్నిప్రోలో కూడా పేలుళ్లు సంభవించాయని రాయిటర్స్ నివేదించింది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు సహాయక సిబ్బంది.
నగరమంతటా క్షిపణి దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. రష్యా ఎంతలా దాడి చేసిన వాటిని తిప్పికొడుతూనే ఉంటామని జెలెన్‌స్కీ అన్నారు. రష్యాకు తలవొంచే ప్రసక్తే లేదన్నారు.
Also Read: Babiya Crocodile Passes Away: ఆ 'శాఖాహార' మొసలి ఇక లేదు- ప్రసాదం తప్ప ఇంకేమీ తినేది కాదట!
Also Read: Nobel Prize 2022 In Economics: ఆర్థిక శాస్త్రంలో ఆ ముగ్గురికి నోబెల్ బహుమతి!