అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Nobel Prize 2022 In Economics: ఆర్థిక శాస్త్రంలో ఆ ముగ్గురికి నోబెల్ బహుమతి!

Nobel Prize 2022 In Economics: ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు బ్యాంకింగ్ రంగ నిపుణులకు నోబెల్ పురస్కారం దక్కింది.

Nobel Prize 2022 In Economics: ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు బ్యాంకింగ్ రంగ నిపుణులకు నోబెల్ బహుమతి దక్కింది. బెన్ ఎస్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ దిబ్విగ్​లకు ఈ అవార్డు వరించింది.

బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై చేసిన పరిశోధనలకు వీరికి అవార్డు ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటనతో ఈ ఏడాది అవార్డులన్నీ ముగిశాయి. ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రంలో విజేతలను నోబెల్ కమిటీ ప్రకటించింది. అనంతరం సాహిత్య రంగంలో విజేతను అక్టోబర్ 6న ప్రకటించారు. అక్టోబర్‌ 7న నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించారు. 

శాంతి బహుమతి

2022 ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని మానవ హక్కుల కోసం ఉద్యమించిన వ్యక్తికి, సంస్థలకు సంయుక్తంగా ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. బెలారస్​కు చెందిన అలెస్​ బియాలియాట్స్కీ, రష్యన్​ మానవ హక్కుల సంస్థ అయిన 'మెమోరియల్', ఉక్రెయిన్​ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ అయిన 'సెంటర్​ ఫర్ సివిల్ లిబర్టీస్​'ను ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ వరించింది.

సాహిత్య రంగంలో

సాహిత్య రంగంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు ఫ్రెంచ్ రచయిత్రి 'అన్నీ ఎర్నాక్స్‌'ను వరించింది. ఈ మేరకు నోబెల్ కమిటీ ప్రకటించింది.

రసాయన శాస్త్రంలో

రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. 'ఇంజినీరింగ్​ టూల్స్​ ఫర్​ మాలుక్యూల్స్​ బిల్డింగ్స్​' పరిశోధనలకు గానూ రసాయన శాస్త్రంలో కారోలిన్‌ బెర్టోజి, మార్టిన్‌ మెల్డల్‌, బారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. 

భౌతిక శాస్త్రంలో

2022 సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా నోబెల్‌ బహుమతి వచ్చింది. భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన అలెన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌ క్లాసర్‌, ఆంటోన్‌ జైలింగర్‌లకు ఈ పురస్కారం దక్కింది. స్టాక్‌హోంలోని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ అవార్డును ప్రకటించింది.  

వైద్య రంగంలో

వైద్య రంగంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు స్వీడన్​కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వరించింది. మానవ పరిణామంపై ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈ మేరకు నోబెల్ కమిటీ సెక్రెటరీ థామస్ పెర్ల్​మన్.. నోబెల్ విజేత పేరును ప్రకటించారు.

డిసెంబర్‌లో

నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్‌ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.

Also Read: Mulayam Singh Yadav Death: 'కాకలు తీరిన యోధుడు- రాజకీయ చదరంగంలో కురువృద్ధుడు'

Also Read: Mulayam Singh Yadav Death: 'ఆయన మరణం నన్ను బాధిస్తోంది'- మోదీ సహా ప్రముఖుల సంతాపం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget