Russia Ukraine War: ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతలపై మోదీ సమీక్ష- పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని!
ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడనున్నట్లు సమాచారం.

రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న భీకర యుద్ధంపై ప్రపంచదేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా ముప్పేట దాడి చేస్తోంది. రష్యా యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. భారత్ కూడా శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లడనున్నట్లు సమాచారం.
ప్రధాని సమీక్ష
#WATCH Prime Minister Narendra Modi chairs meeting of the Cabinet Committee on Security (CCS) pic.twitter.com/9lvHMRi1bT
— ANI (@ANI) February 24, 2022
మరోవైపు రష్యా-ఉక్రెయిన్ పరిణామాలపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. యుద్ధ పరిణామాలు, భారత్‌పై తక్షణ ప్రభావం, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమీక్షలో హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను ముఖ్యంగా విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చే విషయంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం 20 వేల మంది వరకు భారత పౌరులు ఉన్నారు. వీరందరినీ సురక్షితంగా భారత్ తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోంది. పిల్లల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.
70 స్థావరాలు
#BREAKING Russia says destroys over 70 military targets, including 11 airfields, in Ukraine pic.twitter.com/rcFXZ7VjMf
— AFP News Agency (@AFP) February 24, 2022
ఉక్రెయిన్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని రష్యా భీకర దాడులు చేపడుతోంది. ఉక్రెయిన్‌లోని 70 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది రష్యా. ధ్వంసం చేసిన వాటిలో 11 ఎయిర్ ఫీల్డ్స్ కూడా ఉన్నట్లు తెలిపింది.
మరోవైపు తాము చేసిన ప్రతిదాడిలో 100 మందికిపైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
Also Read: Ukraine War Visuvals: ఉక్రెయిన్‌పై రష్యా ఎలా విరుచుకుపడుతుందో తెలుసా ? ఇవిగో దృశ్యాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

