అన్వేషించండి

క్యాన్సర్‌కి వ్యాక్సిన్ తయారు చేస్తున్న రష్యా, త్వరలోనే అందుబాటులోకి

Cancer Vaccines: క్యాన్సర్‌ కట్టడికి వ్యాక్సిన్‌ తయారు చేస్తున్నట్టు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కీలక ప్రకటించారు.

Cancer Vaccine in Russia: రష్యా త్వరలోనే క్యాన్సర్‌కి వ్యాక్సిన్‌ తయారు చేయనుంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ వెల్లడించారు. ఇప్పటికే కొంత మంది సైంటిస్ట్‌లు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారని స్పష్టం చేశారు. వీలైనంత తొందర్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే...ఏ రకం క్యాన్సర్‌కి వ్యాక్సిన్ తయారు చేస్తున్నారన్న పూర్తి వివరాలు మాత్రం పుతిన్ వెల్లడించలేదు. ప్రస్తుతం human papillomaviruses (HPV) ని అరికట్టేందుకు మొత్తం 6 లైసెన్స్‌డ్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ వైరస్‌ ఎన్నో క్యాన్సర్‌లకు దారి తీస్తోంది. ఇందులో సర్వైకల్ క్యాన్సర్‌ కూడా ఉంది. లివర్ క్యాన్సర్‌కి దారి తీసే  hepatitis B (HBV) వ్యాక్సిన్‌లూ అందుబాటులోకి వచ్చాయి. 

"క్యాన్సర్ వ్యాక్సిన్‌ల తయారీలో సైంటిస్ట్‌లు నిమగ్నమై ఉన్నారు. బహుశా త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తుండొచ్చు. వీటితో పాటు రోగనిరోధక శక్తిని పెంచే మందుల తయారీ కూడా జరుగుతోంది. అవి కూడా అందుబాటులోకి వస్తాయి. థెరపీలో త్వరలోనే వీటిని వినియోగిస్తారన్న విశ్వాసం ఉంది."

- పుతిన్, రష్యా అధ్యక్షుడు 

రష్యానే కాదు. చాలా దేశాలు క్యాన్సర్‌ని అరికట్టేందుకు వ్యాక్సిన్‌లు తయారు చేస్తున్నాయి. గతేడాది యూకే ప్రభుత్వం జర్మనీకి చెందిన  BioNTech సంస్థతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ చేపట్టేందుకు అంగీకరించింది. 2030 నాటికి కనీసం 10 వేల మంది బాధితులకు చికిత్స అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. Moderna,Merck & Co లాంటి కంపెనీలు క్యాన్సర్‌కి వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ఉన్నాయి. ప్రాణాంతకమైన స్కిన్ క్యాన్సర్ melanoma ప్రభావాన్ని ఈ వ్యాక్సిన్‌లు తగ్గించే అవకాశాలున్నాయి. కనీసం మూడేళ్లపాటు ట్రీట్‌మెంట్ తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా WHO కీలక విషయాలు వెల్లడించింది. మొత్తం 115 దేశాల్లో క్యాన్సర్‌ ప్రభావం ఉందని తెలిపింది. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవిత కాలంలో క్యాన్సర్‌ బారిన పడుతున్నట్టు స్పష్టం చేసింది. ప్రతి 9 మంది పురుషుల్లో ఒకరు క్యాన్సర్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతుండగా...ప్రతి 12 మంది మహిళల్లో ఒకరు మృతి చెందుతున్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా 97 లక్షల మంది ప్రాణాల్ని బలి తీసుకుందని, 2 కోట్ల మందికి క్యాన్సర్‌ సోకిందని వివరించింది. 

అస‌లు క్యాన్స‌ర్ అంటే ఏంటి? అనేది త‌ర‌చుగా త‌లెత్తే సందేహం. తెలుగులో దీనిని `రాచ‌పుండు` అని పిలుస్తారు. శరీరంలోని సాధారణ కణాల సమూహంలో మార్పులు వల్ల అనియంత్రిత, అసాధారణ పెరుగుదలకు దారితీసినప్పుడు సంభవించే ఒక వ్యాధినే క్యాన్స‌ర్ గా పేర్కొంటారు. శరీరంలో ఇది కణితి వంటి భాగాన్ని ఏర్పాటు చేస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే కణితులు పెరుగుతాయి.  శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి. జీర్ణ, నాడీ, ప్రసరణ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. చివ‌ర‌కు ఇది వ్య‌క్తుల మ‌ర‌ణాల‌కు కూడా కార‌ణ‌మ‌వుతుంది. 

Also Read: మీ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను, రాయ్‌బరేలీ ప్రజలకు సోనియా గాంధీ లేఖ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Embed widget