Independence Day 2021: జాతీయ జెండాను ఇలా ఎగరేస్తున్నారా? జాగ్రత్త.. జైల్లో పెడతారు!
మీకు తెలుసా? జాతీయ జెండాను అగౌరపరిస్తే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కాబట్టి.. ఈ కింది నిబంధనలు పాటిస్తూ.. మన మువ్వన్నెల జెండాకు సగర్వంగా సెల్యూట్ చేయండి.
మన స్వాతంత్ర్య భారతం.. ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలం. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులను స్మరించుకోవడం మన అందరి ధర్మం. పంద్రాగస్టు రోజున మువ్వన్నెల జెండాకు సెల్యూట్ చేయడమే కాదు.. ఆ జెండాను గౌరవించడం కూడా మన బాధ్యత. జాతీయ జెండాను ఇష్టానుసారంగా వాడేస్తే తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. జెండాను అగౌరవపరిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆ తప్పు తెలిసి చేసినా, తెలియక చేసినా నేరంగానే భావిస్తారు. ఈ పంద్రాగస్టు రోజున అలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా ఉండాలంటే.. మీరు తప్పకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి.
1921లో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు. అయితే, అప్పట్లో అది జాతీయ కాంగ్రెస్ జెండాగా చెలామణిలో ఉండేది. 1947 జూన్ 3న బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని వీడనున్నట్లు ప్రకటించారు. దీంతో ఫ్లాగ్ కమిటీ జాతీయ కాంగ్రెస్ జెండాలో స్వల్ప మార్పులు చేసింది. జెండా మధ్యలోని రాట్నం స్థానంలో 24 ఆకులు ధర్మచక్రం పెట్టి జాతీయ జెండాను రూపొందించింది. జులై 22న అధికారికంగా బాబూ రాజేంద్రప్రసాద్‌కు ఆ జెండాను అందించింది.
జాతీయ జెండాను ఆవిష్కరించేప్పుడు ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలి:
⦿ భారత జాతీయ పతాకాన్ని ఖాదీ, చేనేత వస్త్రాలతో మాత్రమే తయారు చేయాలి. నూలు, పత్తి, ఉన్ని ముడి పదార్థాలుగా వాడొచ్చు.
⦿ జాతీయ జెండా పొడవు, వెడల్పుల పరిమాణం 3:2 నిష్పత్తిలో ఉండాలి.
⦿ జాతీయ పతాకం మూడు రంగులు సమాన వెడల్పు గల పట్టీల్లో ఉండాలి.
⦿ జాతీయ జెండాలో పైన కాషాయం, మధ్యలో తెలుపు, కింద ముదురు ఆకుపచ్చ రంగు ఉండాలి.
⦿ తెలుపు పట్టీ మధ్యలో 24 చువ్వలతో నేవీ బ్లూ రంగు అశోక చక్రం ఉండాలి.
⦿ సూర్యోదయం తర్వాత జెండాను ఎగురవేసి, సూర్యస్తమయానికి ముందే కిందికి దించాలి.
⦿ బైకులు, కార్లు ఇతరాత్ర వాహనాల వెనుక భాగంలో జాతీయ జెండాలను పెట్టరాదు.
⦿ జాతీయ జెండాను ఇతర మెటీరియల్‌తో తయారు చేస్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.
⦿ భవనాల పైకప్పు, వేదికలు, గోడలు.. ఇలా ఎక్కడపడితే అక్కడ జాతీయ జెండాలను వేలాడదీయకూడదు.
⦿ జాతీయ జెండాను వాణిజ్య, వ్యక్తిగత ప్రకటనలు, ప్రయోజనాల కోసం ఉపయోగించరాదు.
⦿ జాతీయ జెండాకు సమానంగా గానీ, దానికంటే ఎత్తులో గానీ ఏ జెండా ఎగురకూడదు.
⦿ జాతీయ జెండాను స్తంభానికి చిట్టచివరనే ఎగురవేయాలి. సగం కిందకు దించి ఎగురవేయరాదు.
⦿ జెండాను ఎగురవేసినప్పుడు, దించేప్పుడు వ్యక్తులందరూ జెండాకు అభిముఖంగా నిలబడి ఉండాలి.
⦿ జెండా ఎగురవేసే సమయంలో పాదరక్షణలు తొడగరాదు.
⦿ జెండా ఎగురవేసే సమయంలో చప్పట్లు కొట్టరాదు.
⦿ జెండా ఎగురవేసే సమయంలో శబ్దాలు చేయరాదు.
⦿ ప్లాస్టిక్ జెండాలను ఉపయోగించరాదు.
⦿ జెండాను నేల మీదగానీ, నీటి మీద గానీ పడనీయరాదు.
⦿ జాతీయ జెండాపై రాతలు, సంతకాలు, ప్రింటింగులు ఉండరాదు.
⦿ ఢిల్లీలో ఎర్రకోటపై జెండా ఎగురవేసిన తర్వాతే మిగిలిన చోట్ల ఎగురవేయాలి.
⦿ జెండా ఎగురవేసేప్పుడు ఎడమ చేతితో తాడు లాగుతూ కుడి చేత్తో పైకి పంపాలి.
⦿ జెండా ఎగరగానే నిలబడి సెల్యూట్ చేయాలి. స
⦿ జెండా ఎగురవేసిన తర్వాత జనగణమన గీతాన్ని 56 సెకన్లలో పూర్తిచేయాలి.
⦿ జెండాను తలకిందులుగా ఎగురవేయడం నేరం.
⦿ పాతపడిన జెండాను తుడుపు గుడ్డగా వాడటం కూడా నేరమే.
⦿ జెండా స్తంభం నిటారుగా ఉండాలి. వంకరగా ఉండకూడు.
⦿ జాతీయ జెండా చిరిగినా, కాలినా నేరంగానే పరిగణిస్తారు. కాబట్టి ఈ నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండండి.