UP IT Raids : సమాజ్‌వాదీ పార్టీ నేత ఇంటి నిండా నోట్ల గుట్టలే.. లెక్కపెట్టడానికి వారం సరిపోలేదు.. స్టిల్ కౌంటింగ్ !
సమాజ్ వాదీ పార్టీ నేత పీయూష్ జైన్ ఇంట్లో జరిగిన సోదాల్లో రూ. 150 కోట్లకుపైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా లెక్కింపు కొనసాగుతోంది.
ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన పీయూష్ జైన్ అనే వ్యాపారి ఇంట్లో ఇటీవల జరిగిన ఐటీ సోదాల్లో కట్టలకు కట్టలు నోట్లు బయటపడ్డాయి. డబ్బులు లెక్క పెట్టే యంత్రాలను తీసుకు వచ్చి.. రోజుల తరబడి లెక్కిస్తున్నా.. ఇంకా ఇంకా నోట్లు బయటకు వస్తూనే ఉన్నాయి. గత గురువారం ఐటీ రెయిడ్స్ చేశారు. ఇప్పటికీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ రూ. 150 కోట్లు లెక్క తేలినట్లుగా తెలుస్తోంది. ఇంకా కౌంటింగ్ జరుగుతోందని ఐటీ అధికారులు చెబుతున్నారు.
समाजवादियों का नारा है
— Sambit Patra (@sambitswaraj) December 24, 2021
जनता का पैसा हमारा है!
समाजवादी पार्टी के कार्यालय में समाजवादी इत्र लॉन्च करने वाले पीयूष जैन के यहाँ GST के छापे में बरामद 100+ करोड़ कौन से समाजवाद की काली कमाई है? pic.twitter.com/EEp7H5IHmt
Also Read: డెల్టా మరణమృదంగం - రైతు చట్టాల ఉపసంహరణ.. ! 2021లో భారత్‌కు మరపురాని మైలురాళ్లు ఎన్నో...
పీయూష్ జైన్ కాన్పూర్ కేంద్రంగా పర్‌ఫ్యూమ్ తయారీ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఆయన బిజినెస్ జోరుగా సాగుతూ ఉంటుంది. ఆయన సమాజ్ వాదీ పార్టీ నేత కూడా. అఖిలేష్ యాదవ్‌కు సన్నిహితుడు. ఎంత సన్నిహితుడు అంటే... సమాజ్ వాదీ పార్టీ పేరు మీద ఓ బ్రాండ్ పర్‌ఫ్యూమ్ తయారు చేసి దాన్ని మార్కెట్లోకి కూడా వదిలారు. ఆయనపై ఐటీ అధికారులు గురి పెట్టారు. చాలా రోజులుగా ఆయన వ్యాపార వ్యవహారాలను చూస్తున్న అధికారులు ..., సమయం చూసుకుని రెయిడ్స్ చేశారు. దీంతో అసలు గుట్టు రట్టయింది. బీరువాల్లో .. అల్మరాల్లో.. పరుపుల కింద దాచి పెట్టిన కోట్లన్నింటినీ ఎక్కడిక్కకడ బయటకు తీశారు. ఇక డబ్బులు లెక్క పెట్టే యంత్రాలను... మనుషుల్నితీసుకొచ్చి లెక్కించేపనిలో బిజీగాఉన్నారు.
Also Read: గులాబీకి పూలు - రాళ్లు కూడా .. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికిన 2021 !
ఇప్పటి వరకూ లెక్కించిన దాన్ని బట్టి రూ. నూట యాభై కోట్లుగా తేలాయి. ఇంకా కౌంటింగ్ జరుగుతోంది. అక్కడ డబ్బులులెక్కిస్తున్న దృశ్యాలు.. ఫోటోలతో బీజేపీ నేత సంబిత పాత్ర ట్వీట్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ అవినీతి వాసన అంటూ.. ఆయన చేసిన ట్వీట్.. అందులో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?
పీయూష్ జైన్.. తప్పుడు ఇన్వాయిస్‌లు.. జీఎస్టీ సర్టిఫికెట్లు సమర్పించి.. ఈ ధనం మొత్తం పోగేశారని భావిస్తున్నారు. వ్యాపారం జరగకపోయినా జరిగినట్లుగా చూపించడం... జరిగినా.. ఫేక్ బిల్లులు పెట్టడం వంటి వాటి ద్వారా ఆ బ్లాక్‌మనీని పోగుచేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఆయనకు ఇతర రాష్ట్రాల్లోనూ వ్యాపారాలుఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంకెంత బయటపడతాయో చూడాల్సి ఉంది.
Also Read: దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా..! 'కెప్టెన్ రోహిత్' మర్చిపోలేని 2021