అన్వేషించండి

ప్ర‌పంచంలోని టాప్ 10 సంప‌న్న దేశాలివే!

తలసరి ఆదాయం, GDP ఎక్కువగా ఉన్న దేశం ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఆ దేశ ప్ర‌జ‌ల‌ జీవన ప్రమాణాలు, పర్యావరణ వైవిధ్యం, సుపరిపాలన ఆధారంగా, ప్రపంచంలోని తొలి 10 సంపన్న దేశాల జాబితాను ఇప్పుడు చూద్దాం.

Richest Country in The World: డబ్బుతో ఆనందాన్ని కొన‌లేమ‌నే మాట మనంద‌రం ఏదో సంద‌ర్భంలో వింటూ ఉంటాం. ఈ మాట కొంత‌వ‌ర‌కు నిజ‌మే కానీ.. ఆధునిక ప్ర‌పంచంలో పూర్తిగా నిజంకాదు. జీవ‌నం స‌జావుగా సాగాలంటే, ఆనందం కొన‌లేకపోయినా డ‌బ్బు త‌ప్ప‌నిస‌రి అని ప్ర‌తిఒక్క‌రూ అంగీక‌రించే స‌త్యం. ధ‌న‌మేరా అన్నిటికీ మూలం అని ఓ సినీ క‌వి అన్న‌ట్టు ప్ర‌స్తుతం సుఖ‌మ‌య‌మైన జీవితానికి డ‌బ్బు కీల‌కం. అత్య‌ధిక ఆదాయం ఉన్న దేశం ప్ర‌పంచదేశాల‌ను శాసించే స్థితిలో ఉంటుంది. మ‌రి ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అని ఏ విధంగా నిర్ణ‌యిస్తారు. ఏఏ అంశాలు దీన్ని ప్ర‌భావితం చేస్తాయి. ప్రపంచంలోని అత్య‌ధిక‌ 10 సంపన్న దేశాల వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలను గుర్తించడానికి చాలా సర్వేలు ఆ దేశ‌ స్థూల దేశీయోత్పత్తి (GDP)ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాయి. తలసరి ఆదాయం, GDP ఎక్కువగా ఉన్న దేశం ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. అయితే, ఇది మాత్రమే సంప‌న్న‌దేశంగా పేర్కొనేందుకు స‌రిపోదు. ఆ దేశ ప్ర‌జ‌ల‌ జీవన ప్రమాణాలు, పర్యావరణ వైవిధ్యం, సుపరిపాలన వంటి అనేక ఇతర అంశాలు దీనిని ప్రభావితం చేస్తాయి. ఏదేమైనా, ప్రతి దేశం ఆర్థిక‌ స్థితిని అంచనా వేయడంలో జీడీపీ, తలసరి ఆదాయం అత్యంత సాధారణ అంశం. వీటి ఆధారంగా, ప్రపంచంలోని తొలి 10 సంపన్న దేశాల జాబితాను ఇప్పుడుచూద్దాం.

ఆర్థిక వ్యవస్థలో తొలి 10 దేశాలివే

వివిధ వనరుల నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మెరుగైన‌ ఆర్థిక వ్యవస్థ,  స్థూల దేశీయోత్పత్తి కలిగి ఉన్న ప్రపంచంలోని తొలి 10 దేశాల జాబితా రూపొందిస్తే ఇలా ఉంటుంది.

1. లక్సెంబర్గ్- జీడీపీ- 86.898 బిలియన్ డాల‌ర్లు, తలసరి జీడీపీ - 135,046 డాల‌ర్లు
ప్రపంచంలోని అతిపెద్ద దేశాలను ప‌క్క‌న‌పెట్టి, ఒక చిన్న యూరోపియన్ దేశమైన‌ లక్సెంబర్గ్ ప్రపంచంలోని టాప్ 10 సంపన్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. 2022లో ప్రపంచంలోని అతి తక్కువ జనాభా కలిగిన దేశాలలో ఒకటిగా పేరొందిన‌ లక్సెంబర్గ్ ఐరోపాలోని అతి చిన్న దేశాల్లో ఒకటి. ఈ దేశం తలసరి జీడీపీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికం. వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, లక్సెంబర్గ్ GDP 86.898 బిలియన్ డాల‌ర్లు కాగా, తలసరి జీడీపీ 135,046 డాల‌ర్లు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఉక్కు, బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాలపై ఆధారపడి ఉంటుంది.

2. ఐర్లాండ్- జీడీపీ- 519 బిలియన్ డాల‌ర్లు, త‌ల‌స‌రి జీడీపీ - 102,217 డాల‌ర్లు
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఐర్లాండ్ ఆర్థిక వ్యవస్థ పేరొందింది. గత పదేళ్లలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థను దాదాపు రెట్టింపయింది. ఫలితంగా, ఈ దేశం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. ఐర్లాండ్‌ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఆర్థిక రంగం, హైటెక్, లైఫ్ సైన్సెస్, అగ్రి బిజినెస్‌ సేవల ద్వారా నిర్మిత‌మైంది.

3. నార్వే- జీడీపీ- 541 బిలియన్ డాల‌ర్లు, తలసరి జీడీపీ- 99,481 డాల‌ర్లు
ఐరోపాకు చెందిన‌ నార్వే ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలలో ఒకటి, తలసరి జీడీపీని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా ఇతర అంశాలు కూడా ఈ దేశాన్ని సంపన్న దేశంగా మార్చడానికి దోహదం చేస్తాయి. ఇతర దేశాలతో పోలిస్తే నార్వేలో అవినీతి తక్కువ. ప్రజల జీవన ప్రమాణాలు, ఆయుర్దాయం కూడా ఎక్కువగానే ఉన్నాయి. పశ్చిమ ఐరోపాలో అతిపెద్ద చ‌మురు ఉత్పత్తి దేశంగా నార్వే పేరొందింది. దేశ ఆర్థిక వ్యవస్థలో సింహ‌భాగం చమురు ఉత్ప‌త్తిపైనే ఆధార‌ప‌డి ఉంది. గ‌తంలో పేద దేశంగా ఉన్న నార్వేలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనప్పటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థలో కేంద్రీకృత వృద్ధి కనిపించింది.

4. స్విట్జర్లాండ్- జీడీపీ- 807.418 బిలియన్ డాల‌ర్లు, త‌ల‌స‌రి జీడీపీ- 92,434 డాల‌ర్లు
ప్ర‌కృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన మరో యూరోపియన్ దేశం స్విట్జర్లాండ్. ప్ర‌పంచంలో ప్రస్తుతం చాలా మంది మిలియనీర్లు స్విట్జర్లాండ్‌కు చెందినవారే. ఈ దేశ జీడీపీలో అధిక‌ భాగం అంటే 70శాతం సేవా రంగం నుంచే వస్తుంది. స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవస్థ 2015 నుంచి ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఉన్నత విద్య, బలమైన సంస్థాగత కార్యాచ‌ర‌ణ‌, స్నేహ‌పూరిత‌ వ్యాపార వాతావరణం దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తున్నాయి.

5. ఖతార్- జీడీపీ- 221.369 బిలియన్ డాల‌ర్లు, తలసరి జీడీపీ- 82,887 డాల‌ర్లు
ఐక్య‌రాజ్య‌స‌మితి, ప్ర‌పంచ‌బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సమీకరించిన డేటా ప్రకారం, ఖతార్ ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా ఉంది. పెట్రోలియం, సహజ వాయు నిక్షేపాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక‌గా నిల‌వ‌డంతో పాటు.. దేశ స్థూల ఉత్ప‌త్తిలో 60శాతం కంటే ఎక్కువ భాగం ఆక్ర‌మించాయి. అత్య‌ధికంగా సహజవాయువు ఎగుమతి చేసే దేశాల్లో రెండవ స్థానంలో, సహజవాయువు నిల్వలలో మూడవ స్థానంలో ఖ‌తార్ ఉంది.

6. సింగపూర్- జీడీపీ- 423 బిలియన్ డాల‌ర్లు, త‌ల‌స‌రి జీడీపీ - 79,426 డాల‌ర్లు
సింగపూర్ ఆర్థిక వ్యవస్థ కొవిడ్-19 కార‌ణంగా ప్రభావితమైంది. అయితే ఆ మ‌హ‌మ్మారి విసిరిన‌ సవాళ్లు ఉన్నప్పటికీ,  ప్రపంచంలోని తొలి 10 సంపన్న దేశాల జాబితాలో సింగ‌పూర్ స్థానం ప‌దిలంగా ఉంది. అత్యల్ప పన్ను రేట్లు, అత్యధిక దేశ స్థూల ఉత్ప‌త్తి ఈ దేశం కలిగి ఉంది. అద్భుతమైన ఆర్థిక అభివృద్ధితో సింగ‌పూర్‌.. ప్ర‌స్తుతం ఆగ్నేయాసియా ఆర్థిక, ఉత్పాదక కేంద్రంగా కొన‌సాగుతోంది.

7. అమెరికా- జీడీపీ- 25.035 ట్రిలియన్ డాల‌ర్లు, త‌ల‌స‌రి జీడీపీ- 75,179 డాల‌ర్లు
ప్రపంచంలోని పెద్ద దేశాలలో ఒక‌టిగా, ప్రపంచంలోని అత్యంత ధనిక దేశంగా అమెరికా పరిగణించబడుతుంది. ఈ దేశ త‌ల‌స‌రి జీడీపీ మిగిలిన అన్ని దేశాల కంటే అత్యధికంగా ఉండ‌గా.. కొనుగోలు శ‌క్తి స‌మ‌తుల్య‌త సామ‌ర్థ్యంలో (PPP GDP) చైనా తర్వాత రెండవ అతిపెద్దది. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగం సమృద్ధిగా ఉన్న సహజ వనరులు, అత్యంత అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలతో పాటు భారీ ఉత్పాదకత కీల‌క భూమిక పోషిస్తున్నాయి. ఆమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత ఉత్పాదక ఆర్థిక వ్యవస్థగా పరిగణించబడుతోంది.

8. ఐస్‌లాండ్- జీడీపీ- 27 బిలియన్ డాల‌ర్లు, త‌ల‌స‌రి జీడీపీ- 73,981 డాల‌ర్లు
గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఐర్లాండ్ ఆర్థిక వ్యవస్థ అపారమైన వృద్ధి న‌మోదు చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం, ఎగుమతి, పెట్టుబడి, మ‌త్స్య ప‌రిశ్ర‌మ‌, అల్యూమినియం వెలికితీత ఆధారంగా నిలుస్తున్నాయి. 2011లో ఈ దేశం జీడీపీ 12 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటే, 2018 నాటికి 27 బిలియన్ డాల‌ర్ల‌కు పెరిగింది. అయితే ఆ తర్వాత, దేశ ఆర్థిక వృద్ధి క్ర‌మంగా మందగించింది.

9. డెన్మార్క్- జీడీపీ- 399.1 బిలియన్ డాల‌ర్లు, త‌ల‌స‌రి జీడీపీ - 68,094 డాల‌ర్లు
డెన్మార్క్ ఆర్థిక వ్యవస్థలో ఆ దేశ సేవా రంగం అత్యధిక భాగం అంటే 80శాతం ఆక్ర‌మిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్ర‌భావం తక్కువగానే ప‌డింది. వికీపీడియా ప్రకారం, 2022 నాటికి దేశ జనాభా 5.935 మిలియన్లు. డెన్మార్క్ ప్రజలు సౌకర్యవంతమైన జీవన ప్రమాణాలను కలిగి ఉండ‌టంతో పాటు.. ఈ దేశం తలసరి స్థూల జాతీయ ఆదాయం ప్రపంచంలోనే  ఏడవ స్థానంలో ఉంది.

10. ఆస్ట్రేలియా- జీడీపీ- 1.72 ట్రిలియన్ డాల‌ర్లు, త‌ల‌స‌రి జీడీపీ- 66,407 డాల‌ర్లు
ప్ర‌పంచంలోనే అతి చిన్న ఖండంగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియా మిశ్రమ మార్కెట్ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నా..జీడీపీ వృద్ధిలో మాత్రం సుదీర్ఘ‌ రికార్డు ఉంది.ఇతర దేశాల త‌ర‌హాలోనే ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థపై సేవా రంగానిదే ఆధిపత్యం. తక్కువ జనాభా, సమృద్ధిగా ఉన్న సహజ వనరుల కారణంగా దేశంలో జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి. వికీపీడియా ప్రకారం ఆస్ట్రేలియా జీడీపీ 14వ స్థానంలో ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Embed widget