అన్వేషించండి

CM Revanth letter to Modi: నియోజకవర్గాల పునర్విభజనకు హైబ్రీడ్ మోడల్ పరిశీలించండి - ప్రధాని మోదీకి రేవంత్ లేఖ

Revanth writes to PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం రేవంత్ లేఖ రాశారు. తాను ప్రతిపాదించి హైబ్రీడ్ మోడల్ ను.. నియోజకవర్గాల పునర్విభజనకు పరిశీలించాలని కోరారు.

Revanth writes to PM Modi once again on delimitation issue: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. లోక్‌సభ స్థానాల పెంపు, మహిళా రిజర్వేషన్లు,  నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై ఆయన తన అభిప్రాయాలను మరియు వినూత్నమైన హైబ్రిడ్ మోడల్  ప్రతిపాదనను ఈ లేఖలో వివరించారు 

మహిళా బిల్లుకు మద్దతు - డిలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దు 

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయితే, మహిళా కోటాను ప్రస్తుతమున్న 543 స్థానాల్లోనే తక్షణమే అమలు చేయాలని, దీనిని లోక్‌సభ సీట్ల పెంపుతో ముడిపెట్టకూడదని ఆయన కోరారు .  మహిళల రాజకీయ సాధికారత అనేది కేవలం ఒక చట్టపరమైన సంస్కరణ మాత్రమే కాదని, అది ఒక నైతిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు .

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం 

లోక్‌సభ సీట్లను 850కి పెంచాలనే ప్రతిపాదనపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ  వంటి దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడతాయని హెచ్చరించారు. ఇది అభివృద్ధికి ఇచ్చే శిక్షగా మారుతుందని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆర్థిక వనరుల పంపిణీలో తెలంగాణ వంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గితే అది దేశ సమగ్రతకు ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు .

రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన  హైబ్రిడ్ మోడల్ 

ఈ సమస్యకు పరిష్కారంగా రేవంత్ రెడ్డి ఒక  హైబ్రిడ్ మోడల్ ను ప్రతిపాదించారు . దీని ప్రకారం పెంచబోయే అదనపు సీట్లలో 50 శాతం సీట్లను జనాభా ప్రాతిపదికన కేటాయించాలి . మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల ఆర్థిక సహకారం , సామాజిక అభివృద్ధి ,ఇతర పనితీరు సూచికల ఆధారంగా కేటాయించాలి. ఈ నమూనా వల్ల ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందినందుకు నష్టపోదని, ప్రాతినిధ్యంలో సమతుల్యత ఉంటుందని ఆయన వివరించారు .  

అఖిలపక్ష సమావేశానికి డిమాండ్ 

దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే ఇటువంటి కీలక అంశాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా, తక్షణమే  అఖిలపక్ష సమావేశాన్ని  ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు, రాజకీయ పార్టీలతో సుదీర్ఘంగా చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన, పారదర్శకమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశ బలమని, అన్ని ప్రాంతాల ఆకాంక్షలను గౌరవించినప్పుడే దేశం బలోపేతం అవుతుందని ఆయన తన లేఖలో  పేర్కొన్నారు.                      

 

టాప్ హెడ్ లైన్స్

Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
India WTC Equation: కొలంబో టెస్ట్ డ్రా అయితే ఇండియాకు తిప్ప‌లే...! డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గండి!!
కొలంబో టెస్ట్ డ్రా అయితే ఇండియాకు తిప్ప‌లే...! డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గండి!!
AE Nookaraju Family Suicide Case: సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AE Nookaraju Family Suicide Case: సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
Embed widget