Ind Pak Sweet Exchange: సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత్- పాక్ జవాన్లు
సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), పాకిస్థాన్ జవాన్లు.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మిఠాయిలు పంచుకున్నారు.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్- పాకిస్థాన్ సరిహద్దులో సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. సైనికులు నిరంతరం రెప్ప మూయకుండా ప్రాణాలు పణంగా పెట్టి పహారాకాసే ఉద్రిక్త ప్రదేశంలో స్నేహం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసింది.
అట్టారి-వాఘా సరిహద్దు వద్ద ఇరు దేశాల అధికారులు మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.
#WATCH Border Security Force & Pakistan Rangers exchange sweets and greetings at JCP Attari on India's 73rd Republic Day pic.twitter.com/nTD23Wf937
— ANI (@ANI) January 26, 2022
ఏ ఏడాది న్యూయర్ రోజు కూడా ఇరు దేశాల అధికారులు సరిహద్దులో స్వీట్లు పంచుకున్నారు. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి నాలుగు చోట్ల ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.
మెంధార్ హాట్ స్ప్రింగ్స్ క్రాసింగ్ పాయింట్, పూంచ్ రావ్‌కోట్ క్రాసింగ్ పాయింట్, చకోటి యూఆర్ఐ క్రాసింగ్ పాయింట్ తోపాటు చిల్లానా తిత్వాల్ క్రాసింగ్ పాయింట్ అనే నాలుగు ప్రదేశాలలో భారత్, పాకిస్థాన్ ఆర్మీ అధికారులు స్వీట్లు పంచుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
గత ఏడాది దీపావళి రోజు కూడా ఇరు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు.
అంతకుముందు, జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..
Also Read: Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..