Rashtrapatni Remark: నేను బెంగాలీ, నాకు హిందీ రాదు- క్షమాపణలు మీకు చెప్పను: అధీర్
Adhir Chowdhury Apologies: 'రాష్ట్రపత్ని' వివాదంపై అధీర్ రంజన్ చౌధురీ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెబుతానన్నారు.
Rashtrapatni Remark: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురి మరోసారి స్పందించారు. తాను ఓ బెంగాలీ అని, హిందీ అంతగా రాదని వివరణ ఇచ్చారు. ఈ మేరకు పీటీఐ పేర్కొంది.
ఇదీ జరిగింది
కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి 'రాష్ట్రపత్ని' అనటం తీవ్ర వివాదస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలంటూ ఉభయసభలు ప్రారంభం కాగానే భాజపా ఎంపీలు ఆందోళనకు దిగారు.
#WATCH | Some of our Lok Sabha MPs felt threatened when Sonia Gandhi came up to our senior leader Rama Devi to find out what was happening during which, one of our members approached there & she (Sonia Gandhi) said "You don't talk to me": Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/WxFnT2LTvk
— ANI (@ANI) July 28, 2022
లోక్ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ క్షమాపణలు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
అయితే భాజపా ఎంపీలు పార్లమెంట్ కార్యకలాపాలకు అడ్డుతగులుతూ ఆందోళనలకు దిగుతున్నారు. ఇది రాష్ట్రపతికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని సోనియా గాంధీ.. ఉభయసభలను ఉద్దేశించి క్షమాపణలు చెప్పేంత వరకూ ఆందోళనలను ఆపమని భాజపా ఎంపీలు చెబుతున్నారు
Also Read: Voter ID Card Eligibility: ఈసీ కీలక నిర్ణయం- 17 ఏళ్లకే ఓటర్ కార్డు దరఖాస్తుకు ఛాన్స్!
Also Read: MPs Suspended From Parliament: రాజ్యసభలో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు- 27కు చేరిన లిస్ట్!