(Source: ECI/ABP News/ABP Majha)
Rajasthan Budget 2023: రాజస్థాన్ అసెంబ్లీలో రగడ, పొరపాటున పాత బడ్జెట్‌నే మళ్లీ చదివిన గహ్లోట్ - బీజేపీ ఆందోళన
Rajasthan Budget 2023: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ పొరపాటున పాత బడ్జెట్‌నే మరోసారి చదివారు.
Rajasthan Budget 2023:
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ అభాసుపాలయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆయన ఓ పొరపాటు చేశారు. ఫలితంగా బీజేపీ నేతలు ఒక్కసారిగా ఆందోళన చేశారు. గతేడాది బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. Indira Gandhi Urban Employment Guarantee పథకాన్ని గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది కాంగ్రెస్. ఇప్పుడు కూడా అదే పథకం గురించి మరోసారి ప్రస్తావించారు గహ్లోట్. కాసేపటి తరవాత కానీ అవి పాత బడ్జెట్ ప్రతులు అని అర్థం కాలేదు. వెంటనే గహ్లోట్ తన ప్రసంగాన్ని ఆపేశారు. అప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ ఆందోళనకు దిగింది. తప్పుని గుర్తించిన అశోక్ గహ్లోట్ వెంటనే సభకు క్షమాపణలు చెప్పారు. అయినా...బీజేపీ శాంతించలేదు. శాంతించండి అంటూ స్పీకర్ ఎంతగా చెప్పినా సభలో గందరగోళం చాలా సేపటి వరకూ కొనసాగింది. ఆగ్రహించిన స్పీకర్..సభను వాయిదా వేశారు. రాజస్థాన్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో సభ వాయిదా పడటం ఇదే తొలిసారి. దాదాపు అరగంట పాటు సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
Rajasthan Assembly: BJP protests after CM Gehlot mistakenly reads previous year's budget
— ANI Digital (@ani_digital) February 10, 2023
Read @ANI Story | https://t.co/HiKuUDD6bs#rajasthanbudgetsession #ashokgehlot #bjp pic.twitter.com/1y2gW6hPml