By: Ram Manohar | Updated at : 31 May 2023 01:13 PM (IST)
అమెరికా పర్యటనలో రాహుల్ మోదీపై విమర్శలు చేయడంపై బీజేపీ నేతలు మండి పడుతున్నారు. (Image Credits: Twitter)
BJP on Rahul Gandhi:
అనురాగ్ ఠాకూర్ విమర్శలు..
అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై సెటైర్లు వేయడంపై బీజేపీ నేతలు మండి పడుతున్నారు. విదేశాల్లో భారత్ గురించి తక్కువ చేసి మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో లండన్ పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలే పెద్ద దుమారం రేపాయి. కేంద్రమంత్రులంతా వరుస పెట్టి కౌంటర్‌లు ఇచ్చారు. ఇప్పుడు కూడా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. విదేశీ పర్యటనల్లో భారత్‌ని కించపరిచి మాట్లాడే వైఖరి ఇంకా మారలేదని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ "భారత్‌ని" ఓ దేశంలా పరిగణించడం లేదని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రెడిబిలిటీ సంపాదించుకున్న భారత్ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేందుకే రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి ఉన్న పాపులారిటీని చూసి కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని అన్నారు.
"కాంగ్రెస్‌కి భారత్ ఓ దేశంలానే కనిపించడం లేదేమో. పదేపదే విదేశాల్లో ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ఆయన వైఖరి ఏమీ మారలేదు. 80ల్లో మన దేశంలో దళితులకు, వెనకబడిన వర్గాలకు ఎలాంటి న్యాయమూ జరగలేదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని ఏలింది. ప్రజల్ని బానిసలుగా భావించింది. కానీ...మేం అందుకు భిన్నంగా ప్రజలంతా గర్వపడేలా పరిపాలన కొనసాగిస్తున్నాం. రాహుల్ మాత్రం విదేశాలకు వెళ్లి భారతీయులను, భారత దేశాన్ని అవమానిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రధాని నరేంద్ర మోదీ 24 మంది ప్రధాన మంత్రులను కలిశారు. అధ్యక్షులతో భేటీ అయ్యారు. 50 సార్లు కీలక సమావేశాలు నిర్వహించారు. ఆస్ట్రేలియా ప్రధాని మోదీని బాస్ అని సంబోధించారు. రాహుల్ గాంధీ ఇది తట్టుకోలేకపోతున్నారు"
- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి
#WATCH | During his foreign visits, Rahul Gandhi insults India. PM Modi met almost 24 PMs and Presidents of the world & held over 50 meetings during his foreign visit recently and when the Australian PM said that 'PM Modi is the Boss', Rahul Gandhi could not digest this: Union… pic.twitter.com/8A1jm4DiAd
— ANI (@ANI) May 31, 2023
రాహుల్ కామెంట్స్‌పై మరో బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ఫైర్ అయ్యారు. భారత్ ప్రజాస్వామ్య దేశం కాకపోయుంటే..రాహుల్ విదేశాలకు వెళ్లి సొంత దేశంపై విమర్శలు చేసే అవకాశం ఉండేదా అని ప్రశ్నించారు. "భారత్‌లో ప్రజాస్వామ్యం లేకపోయుంటే..ఏ నేత అయినా విదేశాలకు వెళ్లేవాడా..? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై అలాంటి విమర్శలు చేయలగరా" అని మండి పడ్డారు.
VIDEO | “If India was not a democracy, would any leader be able to go abroad and criticise the duly elected government of the country?” says BJP leader Mukhtar Abbas Naqvi on Congress leader Rahul Gandhi’s speech in California. pic.twitter.com/MhnAMGL6O7
— Press Trust of India (@PTI_News) May 31, 2023
Also Read: Wedding Gift Kits: ప్రభుత్వం ఇచ్చిన వెడ్డింగ్ కిట్స్‌లో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలు - షాక్ అయిన కొత్త జంటలు
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం
AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా
Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1
JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
TS EAMCET: ఎంసెట్ బైపీసీ స్పాట్ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>