Rahul Gandhi Twitter Account: రాహుల్ గాంధీకి మళ్లీ షాక్ ఇచ్చిన ట్విట్టర్... కాంగ్రెస్ ఏమంటోంది
అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలను పోస్టు చేసినందుకు మెుదట రాహుల్ ట్వీట్‌ను ట్విట్టర్ డిలీట్ చేసింది. ఆ తర్వాత ట్విట్టర్ ఖాతాను తాత్కలికంగా సస్పెండ్ చేసింది.
అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలను పోస్ట్ చేసినందుకు.. రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ తాత్కలికంగా సస్పెండ్ చేసింది. అయితే అకౌంట్ ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ విషయంపై ట్విట్టర్ తో మాట్లాడతామని వెల్లడించింది.
అసలు ఏం జరిగిందంటే..
పోక్సో చట్టాన్ని అతిక్రమించి అత్యాచారానికి గురైన బాధితురాలి ఫ్యామిలీ వివరాలు చెప్పినందుకు ట్విట్టర్‌కు నోటీసులు ఇచ్చింది ఎస్‌సీపీసీఆర్. రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో బాధితురాలి ఫ్యామిలీని ఓదారుస్తున్నట్టు పెట్టిన ఫొటో ఇప్పుడు వివాదానికి దారి తీసింది.
పోక్సో చట్టాన్ని అతిక్రమించి అత్యాచారానికి గురైన బాధితురాలి ఫ్యామిలీ వివరాలు చెప్పినందుకు ట్విట్టర్‌కు నోటీసులు ఇచ్చింది ఎస్‌సీపీసీఆర్. రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో బాధితురాలి ఫ్యామిలీని ఓదారుస్తున్నట్టు పెట్టిన ఫొటో ఇప్పుడు వివాదానికి దారి తీసింది.
వివాదానికి దారి తీసిన రాహుల్ గాంధీ ట్వీట్‌ను ట్విట్టర్ డిలీట్ చేసింది. హత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ కలిశారు. న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా ఉంటామంటూ వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో రాహుల్ పోస్టు చేశారు.
ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియాలో బాలిక హత్యాచారానికి గురైంది. ఇది పెను దుమారాన్నే రేపింది. బాలిక తల్లిదండ్రులను కలిసిన కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ... వాళ్లకు అండగా ఉంటామంటూ హమీ ఇచ్చారు. వాళ్లతో కలిసి మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఆ తర్వాత వాళ్లతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పెట్టారు.
పోక్సో చట్టం రూల్స్ ప్రకారం రేప్ బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలి. ఈ రూల్‌ను అతిక్రమించారని... రాహుల్ గాంధీ, ట్విట్టర్‌పై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌కు ఫిర్యాదు అందింది. బాధితుల వివరాలు బహిర్గతం చేసినందుకు చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదుదారు.
ఫిర్యాదుపై స్పందించిన జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్... ట్విట్టర్ తరఫున ఇండియాలో ఉండే గ్రీవెన్స్ ఆఫీసర్‌కు లెటర్ రాసింది. రేప్ విక్టిమ్ ఫ్యామిలీ ఫొటో ట్విట్టర్‌లో పోస్టు చేయడం చాలా బాధాకరమని... ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షార్హమని సూచించింది. పోక్సో చట్టంలోని 23సెక్షన్, జువైనల్ యాక్ట్ 2015లోని 74 సెక్షన్ ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఈ లెటర్‌పై ట్విట్టర్ రియాక్ట్ అయింది. రాహుల్ గాంధీ పోస్టు చేసిన ట్వీట్‌ను డిలీట్ చేసింది. ఢిల్లీలో ఓ బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేశారు. ఈ ఘటన రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. ఆగస్టు 1న నైరుతి ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై దాడి చేసి సామూహిక అత్యాచారం, హత్య చేశారు. బాలిక తల్లిదండ్రులకు తెలియకుండానే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు స్టార్ట్ చేశారు. నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియలకు సహకరించిన పూజారితోపాటు, శ్మశాన వాటికలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ అధికారులు ఆధారాలు సేకరించారు.
ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. బాధిత కుటుంబాన్ని రాహుల్ గాంధీ సహా అనేక మంది నేతలు పరామర్శించారు. బీజేపీ మాత్రం ఈ ఘటనను.. రాజకీయంగా వాడుకుంటున్నారని .. విపక్ష నేతలపై విమర్శలు గుప్పించింది.