అన్వేషించండి

Raghurama : పండగ రోజుల్లో విచారణకు నోటీసులా.. సీఐడీ సునీల్‌పై రఘురామ ఘాటు విమర్శ !

పండుగ రోజుల్లో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇవ్వడంపై రఘురామ మండిపడ్డారు. సీఐడీ సునీల్ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. చట్టాన్ని తాను గౌరవించి విచారణకు హాజరవుతానన్నారు.

ఇన్ని రోజులు పట్టించుకోకుండా పండుగ రోజుల్లో విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడం ఏమిటని వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ సీఐడీ అధికారులపై మండిపడ్డారు. గతంలో ప్రభుత్వంపై కుట్ర పూరితంగా విమర్శలు చేస్తున్నారని ఏపీసీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి రాజద్రోహం కేసు పెట్టింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ఆ తర్వాత ఎప్పుడూ విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇవ్వలేదు. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన ఇంటికి నలుగురు సీఐడీ అధికారుల బృందం వచ్చి.. గురువారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇవాళ నోటీసులు ఇచ్చి ... రేపే విచారణ కావాలని హాజరు కావాలని అడగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీంతో  17వ తేదీన విచారణకు రావాలని చెప్పారని రఘురామకృష్ణరాజు మీడియాకు చెప్పారు. 

Also Read: ఎంపీ రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు.. Hydలోని ఇంటి ఎదుట హడావుడి

సీఐడీ నోటీసులు ఇచ్చిన తర్వాత రఘురామ మీడియాతో మాట్లాడుతూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.  సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది అని అని మండిపడ్డారు. సంక్రాంతి పండుగలకు తాను భీమవరం వెళ్తున్నానని తెలిసి నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇదంతా చూసి ముఖ్యమంత్రి జగన్ ఆనంద పడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు. తాను రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తినని.. చట్టాన్ని గౌరవిస్తూ విచారణకు హాజరవుతానన్నారు. సీఐడీ వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని.. వారి తీరుపై ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు .

Also Read: ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా... నర్సాపురం వెళ్తున్నా రెండు రోజులు అక్కడే ఉంటా... ఎంపీ రఘురామ

గతంలో అరెస్ట్ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాలు లేకుండా చేశారు.. నా సిబ్బందిపై, నా పై వ్యక్తిగతంగా దాడి చేశారని సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వివరాలు సమర్పించానని  రఘురామ ప్రకటించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ అనేది లేదన్నారు. రావణ రాజ్యంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని.. గెలిచిన సీటులోనే మళ్లీ పోటీ చేస్తానన్నారు. ఏపీ ప్రభుత్వం వద్ద రోడ్లు వేయడానికి కూడాడబ్బుల్లేవన్నారు. 

Also Read: త్వరలో ఎంపీ పదవికి రఘురామ రాజీనామా ... అమరావతి ఎజెండాతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం !

నర్సాపురం నుంచి వైఎస్ఆర్‌సీపీ తరపున గెలిచిన రఘురామకృష్ణరాజు తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టి అరెస్టు కూడా చేసింది. అయినా ఆయన విమర్శలు కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందన్న కారణంమగా చాలా రోజులుగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత సంక్రాంతి సందర్భంగా ఆయన నర్సాపురం వెళ్తున్నారు. 

Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Disha Salian death case 2026: సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
Rich Mla Turns Beggar: మా వాచ్‌మెన్ గుర్తుపట్టలేదు, ఆకలి తీర్చిన చిరు వ్యాపారి - భిక్షాటన అనుభవంపై బీజేపీ ఎమ్మెల్యే
మా వాచ్‌మెన్ గుర్తుపట్టలేదు, ఆకలి తీర్చిన చిరు వ్యాపారి - భిక్షాటన అనుభవంపై బీజేపీ ఎమ్మెల్యే
Phone Scroll Psychology Habit: పొద్దున్నే ఫోన్ చూస్తున్నారా? ఇది కేవలం అడిక్షన్ మాత్రమే కాదు.. దీని వెనుక దాగున్న సైకాలజీ ఇదే!
పొద్దున్నే ఫోన్ చూస్తున్నారా? ఇది కేవలం అడిక్షన్ మాత్రమే కాదు.. దీని వెనుక దాగున్న సైకాలజీ ఇదే!
West Bengal: అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR 2004 election affidavit: కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
KCR Erravalli Farmhouse: ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
KTR counter to Revanth Reddy: కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
West Bengal: అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
Disha Salian death case 2026: సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Russia Sanctions Bill: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
Embed widget