అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kandahar Airport Racket Attack: కాందహార్ ఎయిర్ ఫోర్ట్‌పై రాకెట్లతో దాడి... నిలిచిపోయిన విమానసేవలు...తాలిబన్ల దుశ్చర్యగా ధ్రువీకరించిన అధికారులు

అఫ్గానిస్థాన్ లోని కాందహార్ అంతర్జాతీయ విమానాశ్రయంపై మూడు రాకెట్లతో తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో రవ్ వే ధ్వంసమైంది. దీంతో విమాన సేవలు నిలిచిపోయాయి.

అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం రాత్రి వరుస రాకెట్ల దాడి  జరిగింది. ఈ దాడి ఘటనను విమానాశ్రయ చీఫ్‌ మసూద్‌ పష్తూన్‌ ధ్రువీకరించారు. రెండు రాకెట్లు రన్‌వేను తాకాయన్నారు. దీంతో విమాన సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని చెప్పారు. రన్‌వేను బాగుచేసే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 

అమెరికా, నాటో బలగాల నిష్క్రమణ తర్వాత అఫ్గాన్‌లోని చాలా ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఇప్పటికి 80 శాతం భూభాగం వారి చేతుల్లోనే ఉంది. దేశ దక్షిణ ప్రాంతంలో కీలక ప్రాంతమైన కాందహార్ ఆక్రమణకు గత కొన్ని వారాలుగా తాలిబన్లు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్‌ సైన్యానికి, తాలిబన్లకు మధ్య భీకర పోరు జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది తాలిబన్‌ మిలిటెంట్లు నగరంలోకి ప్రవేశించినట్లు సమాచారం. తాలిబన్లపై దాడికి కాందహార్‌ విమానాశ్రయం కీలకంగా వ్యవహరిస్తుంది. కావాల్సిన లాజిస్టిక్‌, వాయుసేన సహకారం ఇక్కడి నుంచే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసి ఉంటారని అధికార వర్గాలు భావిస్తున్నారు. దక్షిణ ప్రాంతంలోని మరో రెండు రాష్ట్రాల రాజధానులైన హెరాత్‌, లష్కర్‌ ఘాను సైతం ఆక్రమించుకునేందుకు తాలిబన్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ నగరాల సరిహద్దులకు వారు చేరుకున్నట్లు తెలుస్తోంది. 

దక్షిణ అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ విమానాశ్రయానికి కనీసం మూడు రాకెట్లు రాత్రిపూట దాడి చేశాయని అధికార వర్గాలు తెలిపారు. తాలిబన్లు దేశవ్యాప్తంగా తమ దాడులను కొనసాగిస్తున్నారు. 
"నిన్న రాత్రి ఎయిర్‌పోర్టుపై మూడు రాకెట్లు ప్రయోగించారు. వాటిలో రెండు రన్‌వేను ఢీకొన్నాయి. ఈ కారణంగా విమానాశ్రయం నుండి సేవలు తాత్కాలికంగా రద్దు చేశాము" అని ఎయిర్‌పోర్ట్ చీఫ్ మసౌద్ పష్తూన్ చెప్పారు. రన్‌వే మరమ్మతు పనులు జరుగుతున్నాయని, ఆదివారం విమానాశ్రయం సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కాబుల్ లోని సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారి రాకెట్ దాడిని ధృవీకరించారు. 

తాలిబన్లు ప్రావిన్షియల్ రాజధానిని స్వాధీనం చేసుకునే అంచున ఉన్నారనే భయాన్ని రేకెత్తిస్తున్నారు. తాలిబన్లు కాందహార్ శివార్లలో కొన్ని వారాలుగా దాడులు చేస్తున్నారు. అఫ్గానిస్తాన్ రెండో అతి పెద్ద నగరాన్ని మిలిటెంట్లు దాడి నుంచి కాపాడుకోడానికి అవసరమైన లాజిస్టిక్స్, ఎయిర్ సపోర్ట్ అందించడానికి కాందహార్ ఎయిర్ బేస్ చాలా ముఖ్యమైనది. పశ్చిమాన హెరాత్, దక్షిణాన లష్కర్ గాహ్ అనే రెండు ఇతర ప్రావిన్షియల్ రాజధానులను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఈ విమానాశ్రయంపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. యూఎస్ మిలిటరీ ఉపసంహరణ చివరి దశలో తాలిబన్లు వరుస దాడులతో అఫ్గానిస్తాన్ లో చాలా ప్రాంతాలను అక్రమించుకున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget