Queen Elizabeth: 8ఏళ్లకే ప్రేమ- 21 ఏళ్లకే పెళ్లి- క్వీన్ ఎలిజబెత్ లైఫ్‌లో అన్నీ వండర్సే!
Queen Elizabeth: 1934లో జరిగిన ఓ రాజ కుటుంబపు వివాహానికి హాజరైన ఆమె.. అక్కడే ఫిలిప్ ను మొదటిసారిగా కలుసుకున్నారు. అప్పుడు ఆమె వయసు 8 ఏళ్లు.
Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ II (ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ).. ఏప్రిల్ 21, 1926న లండన్‌లోని మేఫెయిర్‌లో డ్యూక్ మరియు డచెస్ ఆఫ్ యార్క్(తరువాత కింగ్ జార్జ్ VI మరియు క్వీన్ కన్సార్ట్ ఎలిజబెత్) దంపతులకు జన్మించింది. ఆమె చెల్లి ప్రిన్సెస్ మార్గరెట్. ఈ ఇద్దరు యువరాణులు అందరు పిల్లల్లాగా బడికి వెళ్లలేదు. ప్యాలెస్ లోనే చదువుకున్నారు. ఇందుకోసం క్వీన్ తల్లి ఎలిజబెత్ ఓ ప్రత్యేక ట్యూటర్ ని నియమించారు. ఆమె పర్యవేక్షణలోనే చరిత్ర, భాష, సాహిత్యం, సంగీతం.. వంటి విషయం అక్కచెల్లెళ్లిద్దరూ ఆరి తేరారు. అంతే కాదండోయ్ క్వీన్ ఎలిజబెత్ కాన్ స్టిట్యూషనల్ హిస్టరీ, లా లో పైచదువులు చదివారు.
గుర్రాలపైనే కాదండోయ్.. శునకాలపై కూడా ప్రేమే..!
క్వీన్ ఎలిజబెత్ కు చిన్నప్పటి నుంచే గుర్రాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. నాలుగేళ్ల వయసులోనే ఆమెకు షెట్ ల్యాండ్ పోనీ అనే గుర్రాన్ని ఇచ్చారు. ఆమె ఆరేళ్ల వయసులో గుర్రపు స్వారీ చేయడం ప్రారంభించారు. 18 ఏళ్ల వయసుకు వచ్చే సరికి ఆమె ఆమె గుర్రపు స్వారీ చేయడంలో ఆరితేరారు. క్వీన్ ఎలిజబెత్ కు గుర్రాలంటేనే కాదండోయ్ కుక్కలు అంటే కూడా చాలా ప్రేమ.
ఏడాదికి రెండు సార్లు పుట్టిన రోజు..!
క్వీన్ ఎలిజబెత్ ఏడాదికి రెండు సార్లు పుట్టిన రోజు జరుపుకునేది. అందుకు కారణం కూడా ఉంది. అయితే తన అసలు పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 21న నిరాడంబరంగా తన ప్యాలెస్ లోనే బర్త్ డే వేడుకలు చేసుకునేది. ఇక అధికారికంగా జూన్ రెండో మంగళవారం మరోసారి తన పుట్టిన రోజును చేసుకునేది. అయితే బ్రిటన్ లో ఏప్రిల్ లో వసంత రుతువు ఉంటుంది. ఆ సమయంలో ఉన్నట్లుండి వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి అవుట్ డోర్ వేడుకలు, పరేడ్ లకు అనువైన సమయం కాదు. అందుకే వేసవి కాలం అయిన జూన్ లో తన పుట్టిన రోజు వేడుకలు చేసుకునేది.
1937వ సంవత్సరం మే 12వ తేదీన తన తండ్రి కింగ్ జార్గ్ సమక్షంలో క్వీన్ ఎలిజబెత్ కు పట్టాభిషేకం జరిగింది. నార్ఫోక్ 16వ డ్యూక్ ఎర్ల్ మార్షల్ బెర్నార్డ్ ఫిట్జాలాన్-హోవార్డ్ ఆమెను అభినందించారు. ప్రిన్సెస్ ఎలిజబెత్, మార్గరెట్.. 1940లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం విషయాలను రేడియో ద్వారా పిల్లలకు వినిపించారు. బ్రిటీష్ ఆర్మీలోని ఆక్సిలరీ టెరిటోరియర్ సర్వీస్ లో చేరారు. అక్కడే మెకానిక్ గా పాఠాలు నేర్చుకున్నారు. ఆపై సైన్యంలో పూర్తి స్థాయి సభ్యురాలిగా ఉన్నారు. ఇలా రాజ కుటుంబం నుంచి సైన్యంలో చేరిన తొలి మహిళగానూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.
ఫిలిప్ తో ప్రేమాయణం..
1934లో జరిగిన ఓ రాజ కుటుంబపు వివాహానికి హాజరైన ఆమె.. అక్కడే ఫిలిప్ ను మొదటిసారిగా కలుసుకున్నారు. అప్పుడు ఆమె వయసు 8 ఏళ్లు. ఆ తర్వాత ప్రేమ లేఖలు రాసుకోవడం, రహస్యంగా నిశ్చితార్థం చేసుకోవడం కూడా జరిగిపోయాయి. 1947లో పెళ్లి పీటలెక్కిన ఈ జంటకు నలుగురు సంతానం.