News
News
X

క్వీన్ ఎలిజబెత్‌కు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చిన నిజాం, ధరెంతో తెలుసా?

Queen Elizabeth II: హైదరాబాద్ నిజాం క్వీన్ ఎలిజబెత్‌కు డైమండ్ నెక్లెస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.

FOLLOW US: 

Queen Elizabeth II: 

బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 కు భారత్ కు అవినాభావ సంబంధాలు ఉండేవి. ప్రత్యేకించి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే మహారాణి ఆహార్యంలో ఓ భారతీయుడు అందించిన ఆభరణాలు జీవితాంతం స్థానం సంపాదించాయంటే కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పాలి. హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన సాగించిన అప్పటి నిజాం అసఫ్ జా 7...యూకే గద్దెనెక్కకముందే క్వీన్ ఎలిజబెత్ కు విలువైన వజ్రాల నగలను కానుకగా అందించారు. 

నిజాం తరపున వివాహ కానుక :

1947లో జరిగిన క్వీన్ ఎలిజబెత్ వివాహం సమయంలో నిజాం హైదరాబాద్ నుంచి వజ్రాల హారాలను, నగలను ఓ పెద్ద పేటికలో పంపించారంట. పైగా వాటిలో అప్పటికి రాకుమారి అయిన ఎలిజబెత్ తనకు కావాల్సిన నగలను తీసుకోవచ్చని సందేశాన్ని పంపించారంట. అయితే నిజాం పంపిన నగల్లో మూడొందల వజ్రాలు పొదిగిన ఓ డైమండ్ నెక్లెస్ ను ఎలిజబెత్ స్వీకరించారు. ఆ నెక్లెస్ ఎంతో ఇష్టంగా ధరించేవారు రాణి ఎలిజబెత్. 

అధికారిక చిత్రాల్లోనూ అదే నెక్లెస్ :

అప్పట్లో యూకే అధీనంలో ఉన్న కామన్ వెల్త్ దేశాల్లోని నోట్లపై, పోస్టల్ స్టాంపులపై క్వీన్ ఎలిజబెత్ చిత్రాల్లో ఈ నగలు స్పష్టంగా కనిపించేవి. 1952 లో బ్రిటీష్ రాణిగా పట్టాభిషేకమయ్యాక కామన్ వెల్త్ దేశాల్లోని కార్యాలయాల్లో పెట్టే  మహా రాణి అధికారిక చిత్రాల్లోనూ నిజాం ప్రభువు సమర్పించిన కానుకలే కనిపించేవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కామన్ వెల్త్ దేశాల్లోనూ నిజాం ప్రభువు నగలతో ఉన్న ఎలిజబెత్ చిత్రాలనే అధికారిక చిత్రాలుగా చెలామణి చేయటం ద్వారా వరల్డ్ వైడ్ ఈ నగలు ఏంటనే చర్చలు నడిచేవి. 

రాయల్ ఫ్యామిలీ ఖజానా :

సాధారణంగా బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ కు సంబంధించిన మహిళలంతా అత్యంత విలువైన నగలను ధరిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి కామన్ వెల్త్ దేశాలు సహా అనేక దేశాలు తమ దేశంలోని అత్యుత్తమ నగలు, వజ్రాలు, బంగారంతో ఆభరణాలు తయారు చేసి కానుకలుగా రాణికి పంపించేవారు. నెక్లెస్ లు, ఇయర్ రింగ్స్, బ్రేస్ లైట్స్, వాచెస్ ఇలా ఒక్కో ఆభరణాన్ని ఒక్కో ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దిన డిజైనరీ వేర్స్ వందలు, వేల కొద్దీ బ్రిటీష్ రాయల్ సొసైటీ ఖజనాలో ఉన్నాయి. కానీ నిజాం ప్రభువు కానుకగా సమర్పించిన డైమండ్ నెక్లెస్ వాటిన్నింటిలో కంటే ప్రత్యేకమైనది, విలువైనదిగా భావిస్తారు. 

నిజాం డైమండ్ నెక్లెస్ ధర :

రాయల్ సొసైటీ ఫోటోగ్రాఫర్ డొరొతీ వైల్డింగ్  తీసిన క్వీన్ ఎలిజబెత్ నగల ఫోటోలు నేటికీ రాయల్ ఫ్యామిలీ డిస్ ప్లే స్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రిన్స్ విలియం భార్య డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి కేథరిన్ కు మాత్రమే ఆ డైమండ్ నెక్లెస్ ను అప్పుడప్పుడూ ధరించేందుకు క్వీన్ ఎలిజబెత్ అనుమతినిచ్చారు. ఇంతకీ నిజాం ప్రభువు సమర్పించిన ఆ నగ విలువ ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం 66 మిలియన్ యూరోలు...అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 530 కోట్ల రూపాయలు.

Published at : 09 Sep 2022 04:53 PM (IST) Tags: Queen Elizabeth II Queen Elizabeth II Gifted Diamond necklace Nizam Gifted Necklace Queen Elizabeth II died

సంబంధిత కథనాలు

Visakha Daspalla Lands : విశాఖ దసపల్లా భూములపై ప్రభుత్వం కీలక ఆదేశాలు, సీబీఐ విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్!

Visakha Daspalla Lands : విశాఖ దసపల్లా భూములపై ప్రభుత్వం కీలక ఆదేశాలు, సీబీఐ విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్!

NMMS scholarship 2022: పేద విద్యార్థులకు వరం - ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనం, ఎంపిక ఇలా!

NMMS scholarship 2022: పేద విద్యార్థులకు వరం - ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనం, ఎంపిక ఇలా!

BRAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ గడువు మళ్లీ పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

BRAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ గడువు మళ్లీ పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

ABP Desam Top 10, 1 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 1 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు