అన్వేషించండి

Rash Driving Case: ప్రజా భవన్‌ ర్యాష్ డ్రైవింగ్ కేసులో కీలక మలుపు, ఎఫ్ఐఆర్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పేరు కూడా

Hyderabad News: రహీల్‌కు సాయం చేసిన ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అర్బాజ్‌, సోహెల్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు కూడా తరలించారు.

Praja Bhavan Rash Driving Case: గతేడాది డిసెంబరులో హైదరాబాద్ లోని ప్రజాభవన్‌ ముందు జరిగిన ర్యాష్ డ్రైవింగ్ లో కీలక మలుపు జరిగింది. ఈ కేసులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ పేరును కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో జోడించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజా భవన్ ఎదుట బారీకేడ్లను ఢీకొన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఘటన జరిగిన వెంటనే రహీల్‌ దుబాయ్‌ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

రహీల్‌కు సాయం చేసిన ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అర్బాజ్‌, సోహెల్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. మరో ముగ్గురు పారిపోయినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇప్పటికే రహీల్‌పై పోలీసులు ఎల్‌వోసీ జారీ చేశారు. దుబాయ్ లోఉన్న రహీల్ ను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.


బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇరుక్కున్నాడు. ఈ ఘటన రెండు రోజులు ఆలస్యంగా వెలుగుచూసింది. డిసెంబరు 23న అర్ధరాత్రి దాటాక 2.45 గంటల సమయంలో అత్యంత వేగంతో ఓ బీఎండబ్ల్యూ కారు (TS 13 ET 0777) ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ నియంత్రణ కోసం అడ్డుగా ఉంచిన బారికేడ్లను ఢీకొట్టి ముందుకు వెళ్లింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా, వాహన వేగానికి కారు ముందు భాగం బాగా దెబ్బతిన్నది.

ఈ బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించిన ఘటనలో షకీల్  కుమారుడి పేరును కూడా చేర్చారు. ఈ విషయాన్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడ్ని తప్పించారని ప్రచారం ఉన్నందున స్వయంగా డీసీపీ దీనిపై వివరణ ఇచ్చారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ అని డీసీపీ చెప్పారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని.. మిగతా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. గతంలో కూడా ఓ ప్రాంతంలో కారుతో విధ్వంసం సృష్టించి రాహిల్ ఒకరి మరణానికి కారణమయ్యాడని డీసీపీ పేర్కొన్నారు.

ప్రజా భవన్ ఎదురుగా రోడ్డుపై న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్స్ ఉన్నాయని, వాటిని అతి వేగంగా వచ్చి అతను కారుతో ఢీకొన్నాడని వివరించారు. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారని చెప్పారు. వీళ్లంతా కాలేజీ స్టూడెంట్స్ అని చెప్పారు. 

అయితే, ఈ కేసు నమోదు సమయంలో అసలు నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యేను మరొకరి పేరును చేర్చినట్టు ఆరోపణలు వచ్చాయి. పంజాగుట్ట పోలీసులు మాత్రం.. డ్రైవింగ్‌ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్యపరీక్షల నిమిత్తం ట్రాఫిక్‌ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. కానీ, ప్రమాద సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారయ్యారని చెప్పారు. మరో యువకుడిని పట్టుకున్నారు. అతడిని పరీక్షించి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి.. మద్యం తాగలేదని గుర్తించారు. అయితే, మాజీ ఎమ్మెల్యే ఆదేశంతో తన కుమారుడి ఇంట్లో పనిచేసే డ్రైవర్ తానే కారును డ్రైవ్ చేసినట్లుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
BCCI Injury Crisis: సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget