Charanjit Singh Channi: తొలి బంతికే 'చన్నీ' సిక్సర్.. ఆమ్‌ఆద్మీకి కౌంటర్.. రైతులు బేఫికర్
పంజాబ్ ముఖ్యమంత్రిగా తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు చరణ్‌జిత్ సింగ్ చన్నీ. పెండింగ్‌లో ఉన్న రైతుల నీటి, విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.
పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చరణ్‌జిత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడారు. సీఎం అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు చెబుతూనే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓ 'ఆమ్‌ఆద్మీ' (సామాన్యూడు) అని ఈ సందర్భంగా చన్నీ అన్నారు. ప్రజల బాధలు, సమస్యలను తీర్చడానికి ఓ సామాన్యుడిలానే అర్థం చేసుకుంటానన్నారు.
#WATCH Punjab CM Charanjit Singh Channi gets emotional while addressing his first press conference in Chandigarh says "Congress has made a common man the chief minister." pic.twitter.com/4QNV990OR7
— ANI (@ANI) September 20, 2021
భావోద్వేగం..
తన నేపథ్యం గురించి చెబుతూ ఒకానొక సందర్భంలో చన్నీ భావోద్వేగం చెందారు. తన తండ్రి ఓ రిక్షావాలా అని, తల్లి చుట్టుపక్కల ఇళ్లలో పని చేసేవారని అలానే తనని పోషించారని చన్నీ అన్నారు. పంజాబ్ ప్రజల జీవిత ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
చన్నీ స్పీచ్‌లో కీ పాయింట్స్..
- ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలుస్తామని.. కొత్త సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని చన్నీ డిమాండ్ చేశారు.
- రైతుల కోసం ఇంతకుముందు కూడా తాను నిలబడ్డానని.. రైతుల బాధలు తీర్చేందుకు ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
- ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రైతుల నీటి, విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
- పంజాబ్‌లో బలపడేందుకు చూస్తోన్న ఆమ్‌ఆద్మీని దృష్టిలో పెట్టుకొని తాను ఓ సామాన్యుడినని చన్నీ అన్నారు. పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. సెలబ్రెటీ నుంచి రాజకీయనేతలు, సామాన్యుల వరకు అందరికీ రూల్స్ ఒకేలా ఉంటాయని చన్నీ స్పష్టం చేశారు.
- అటు అమరీందర్ సింగ్ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసిస్తూనే కాంగ్రెస్ అధిష్ఠానమే అంతిమమన్నారు చన్నీ.
- తాను ఓ సామాన్యుడికి ప్రతినిధినని ఈ సందర్భంగా చన్నీ అన్నారు. ధనవంతులు, ఇసుకదందాలు, అక్రమాలకు పాల్పడేవారు తన వద్దకు రావొద్దని చన్నీ తేల్చిచెప్పారు.