By: ABP Desam | Updated at : 17 Jan 2022 01:12 PM (IST)
Edited By: Murali Krishna
ఎన్నికల సంఘం కీలక భేటీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని వివిధ రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు భేటీ కానుంది. గురు రవిదాస్ జయంతి ఉన్నందున ఎన్నికల తేదీ మార్చాలని కాంగ్రెస్, భాజపా, అకాలీదళ్ తదితర పార్టీలు కోరాయి.
ఎందుకంటే?
ఫిబ్రవరి 16న రవిదాస్ జయంతి ఉంది. ఈ సందర్భంగా లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్‌ప్రదేశ్ వారణాసికి వెళ్తుంటారు. ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉండదని రాజకీయ పార్టీలు పేర్కొంటున్నాయి.
సీఎం లేఖ..
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ కూడా ఈ విషయమై జనవరి 13న ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రవిదాస్ జయంతి సందర్భంగా పంజాబ్ నుంచి చాలామంది ఉత్తర్‌ప్రదేశ్ వెళ్తారని చన్నీ అన్నారు. అందుకోసమే ఎన్నికలు వాయిదా వేయాలంటూ దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు తనను కోరిన విషయాన్ని ఈసీ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఈ వర్గానికి చెందినవారు దాదాపు 32 శాతంగా ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.
ఇతర పార్టీలు..
ఎన్నికలు వాయిదా వేయాలని విషయంపై కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు కూడా ఏకతాటిపై ఉన్నాయి. భాజపా, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మరి రాజకీయ పార్టీల చేసిన అభ్యర్థనను ఈసీ పరిగణిస్తుందా లేక మునుపటి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తుందో ఈ రోజు భేటీలో తేలనుంది.
Also Read: Omicron Cases: భారత్‌లో కాస్త శాంతించిన కరోనా మహమ్మారి.. మరోవైపు 8 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?
Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్