By: ABP Desam | Updated at : 03 Jan 2022 09:44 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ప్రియాంక గాంధీ(ఫైలో ఫొటో)
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఇంట్లో కరోనా కలకలం రేపింది. ప్రియాంక గాంధీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి, ఆమె ఆఫీస్ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. వైద్యుల సూచనల తో తాను ఐసోలేట్ అయ్యాయని, కోవిడ్ పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చిందని ప్రియాంక గాంధీ తెలిపారు.
A member of my family and one of my staff have tested positive for COVID-19 yesterday.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 3, 2022
I have tested negative today however the doctor has advised that I remain isolated and test again after a few days.
Also Read: 2022లో కొవిడ్ అంతం.. కానీ అలా చేస్తేనే సాధ్యం: డబ్ల్యూహెచ్ఓ
ప్రియాంక గాంధీ ట్వీట్
'మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి, స్టాఫ్ లో ఒకరికి కోవిడ్ లక్షణాలు వచ్చాయి. నిన్న వారికి పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నేను కూడా ఇవాళ కోవిడ్ పరీక్షలు చేయకున్నాను. రిపోర్టు నెగిటివ్ వచ్చింది. వైద్యులు ఇంట్లో ఐసోలేట్ గా ఉండమని సూచించారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు' అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. గత ఏడాది ఏప్రిల్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తనకు కోవిడ్ సోకినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తనకు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని అప్పట్లో ఆయన తెలిపారు.
Also Read: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు
ఉత్తర్ ప్రదేశ్ లో ప్రచారం
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యత ప్రియాంక గాంధీ చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వ పరిస్థితిని తీసుకొచ్చేందుకు ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో ఆమెకు కోవిడ్ సోకిన వార్త కార్యకర్తలను కాస్త కలవరపెడుతోంది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ రోజు వార్తల్లో నిలుస్తున్నారు ప్రియాంక గాంధీ. ముందస్తు పోల్ సర్వేలు పరిస్థితులు కాంగ్రెస్ కు అంతగా అనుకూలంగా లేవని చెబుతున్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నా కాంగ్రెస్ ఓట్ల షేర్ పెంచేందుకు ప్రియాంక గాంధీ మాత్రం తీవ్రంగా కృషిచేస్తున్నారు.
Also Read: 100 ఎకరాల్లో రూ.300 కోట్లతో సంస్కృత విశ్వవిద్యాలయం.. మంగళవారం సీఎం శంకుస్థాపన
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
/body>