అన్వేషించండి

Jailer marries prisoner: జైలు గోడల మధ్య చిగురించిన ప్రేమ - ఖైదీతో ప్రేమలో పడ్డ జైలు అధికారిణి.. 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత పెళ్లి!

Madhya Pradesh Love Story: హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన ఖైదీ.. అదే జైలులో అధికారిణిగా పనిచేసిన మహిళా ఆఫీసర్ మనసు గెలుచుకున్నాడు. 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

prison officer marries prisoner:  ప్రేమకు సరిహద్దులు లేవని, అది ఎక్కడైనా, ఎవరి మధ్యనైనా పుట్టవచ్చని మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో జరిగిన ఒక సంఘటన నిరూపించింది. ఒకప్పుడు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన ఖైదీ.. అదే జైలులో అధికారిణిగా పనిచేసిన మహిళా ఆఫీసర్ మనసు గెలుచుకున్నాడు. మతాలు, సామాజిక హోదాలు అడ్డువచ్చినా వాటన్నింటినీ అధిగమించి, సుమారు 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

 ఆ పరిచయం.. ప్రేమగా ఎలా మారింది?                  

ధర్మేంద్ర సింగ్ అనే వ్యక్తి 2007లో ఒక హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడి సత్నా జిల్లా జైలుకు వచ్చాడు. అదే సమయంలో ఫిరోజా బి అనే మహిళ అక్కడ జైలు అధికారిణిగా పనిచేసేవారు. విధి నిర్వహణలో భాగంగా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ధర్మేంద్ర జైలులో ఉంటూనే తన తప్పును తెలుసుకుని, ఆధ్యాత్మికత వైపు మళ్లడం, క్రమశిక్షణతో మెలుగుతుండటం చూసి ఫిరోజా ప్రభావితమయ్యారు. ఆ పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ప్రేమ అంటే బయటి సమాజం ఎలా చూస్తుందో తెలిసినా, ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

 14 ఏళ్ల నిరీక్షణ.. సత్ప్రవర్తనతో విడుదల               

ధర్మేంద్ర జైలులో ఉన్నంత కాలం ఫిరోజా ఆయనకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. శిక్షా కాలం ముగిసే వరకూ   వేచి చూడాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ధర్మేంద్ర సత్ప్రవర్తనను గమనించిన ప్రభుత్వం, సుమారు 14 ఏళ్ల తర్వాత ఆయనను జైలు నుంచి విడుదల చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఫిరోజా తన మాటపైనే నిలబడ్డారు. ధర్మేంద్రను పెళ్లి చేసుకోవాలని ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె కుటుంబంలో పెద్ద కలకలమే రేపింది.

 ఎదురైన అడ్డంకులు.. మతాల మధ్య చిచ్చు 

ఫిరోజా ముస్లిం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక మాజీ ఖైదీని, పైగా హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తమకు ఇష్టం లేదని భీష్మించుక కూర్చున్నారు. కానీ ఫిరోజా తన ప్రేమ కోసం కుటుంబాన్ని కూడా కాదనుకున్నారు. ఈ క్రమంలో విశ్వ హిందూ పరిషత్  , బజరంగ్ దళ్ నేతలు ఈ జంటకు అండగా నిలిచారు. ధర్మేంద్ర తన ప్రాణాలను పణంగా పెట్టి అయినా తనను రక్షించుకుంటాడనే నమ్మకంతో ఫిరోజా ముందుకు సాగారు.

 హిందూ సంప్రదాయంలో వివాహం 

మే 5వ తేదీన సత్నాలోని ఒక ఆలయంలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం ధర్మేంద్ర, ఫిరోజా మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ వివాహ వేడుకలో విహెచ్‌పి నేతలు సాక్షులుగా నిలిచి, నూతన వధూవరులను ఆశీర్వదించారు.  జైలులో మొదలైన బంధం ఈరోజు పవిత్రమైన పెళ్లితో ముగియడం ఆనందంగా ఉంది  అని ధర్మేంద్ర తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.    

Advertisement

టాప్ హెడ్ లైన్స్

FIFA Expansion Plan: పుట్ బాల్ వరల్డ్ కప్ లో ఇండియా..  ఫిఫా చీఫ్ గియాని ఇన్ఫాంటినో కొత్త ఐడియా.. 2030లో ఛాన్స్..
పుట్ బాల్ వరల్డ్ కప్ లో ఇండియా..!  ఫిఫా చీఫ్ గియాని ఇన్ఫాంటినో కొత్త ఐడియా.. 2030లో ఛాన్స్..
ABP Desam Top 10, 13 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 13 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
DK Shivakumar: కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !
కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !
Breaking News: ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య- మృతదేహం రికవరీ చేసుకున్న పోలీసులు 
ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య- మృతదేహం రికవరీ చేసుకున్న పోలీసులు 
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Embed widget