అన్వేషించండి

Lanka to India: శ్రీలంక నుంచి ఈదుకుంటూ ఇండియాకొచ్చేశారు - బెంగళూరు జంట రికార్డ్

swims from Sri Lanka to India: బెంగళూరుకు చెందిన ఒక దంపతులు సముద్ర గర్భంలో అద్భుతం సృష్టించారు. శ్రీలంక నుంచి భారత్ వరకు ఉన్న పాక్ జలసంధిని ఈదుకుంటూ వచ్చారు.

couple swims from Sri Lanka to India: బెంగళూరుకు చెందిన ఒక దంపతులు సముద్ర గర్భంలో అద్భుతం సృష్టించారు. శ్రీలంక నుంచి భారత్ వరకు ఉన్న పాక్ జలసంధిని ఈదుకుంటూ దాటి సరికొత్త చరిత్ర లిఖించారు.   సరిహద్దులు కేవలం భూమి మీదనే కాదు, సముద్రం పైన కూడా ఉంటాయి.  కానీ ఆ సముద్రపు అలలను చీల్చుకుంటూ, అసాధారణ పట్టుదలతో బెంగళూరుకు చెందిన ఒక ఐటీ దంపతులు అరుదైన రికార్డు సృష్టించారు.  డానిష్ అబ్దీ , వృషాలి ప్రసాద్  అనే దంపతులు శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భారత తీరంలోని ధనుష్కోడి వరకు సుమారు 32 కిలోమీటర్ల దూరాన్ని ఈదుకుంటూ దాటారు. ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని వారు కేవలం 10 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేసి మేము సాధించాం అంటూ గర్వంగా ప్రకటించారు.

 రామ్ సేతు మార్గంలో సాహస యాత్ర 

చారిత్రక   సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన  రామ్ సేతు మార్గంలో ఈ ఈత సాహసం కొనసాగింది. బుధవారం తెల్లవారుజామున శ్రీలంక తీరంలో ప్రారంభమైన వీరి ప్రయాణం, హిందూ మహాసముద్రంలోని బలమైన అలలు, ఎదురుగాలి , సముద్రపు జీవుల సవాళ్లను అధిగమిస్తూ సాగింది. మణిపాల్ హాస్పిటల్స్ మద్దతుతో జరిగిన ఈ  ఓపెన్ వాటర్ స్విమ్ లో వీరిద్దరూ ఏకధాటిగా ఈదుతూ భారత భూభాగంలోకి అడుగుపెట్టారు. ఒక జంటగా ఈ మార్గాన్ని దాటిన మొదటి దంపతులుగా వీరు రికార్డు పుటల్లోకి ఎక్కారు.

 నాలుగేళ్ల క్రితమే ఈత నేర్చుకుని..                       

ఈ విజయం వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న ఈ దంపతులు కేవలం నాలుగేళ్ల క్రితమే ఈత నేర్చుకున్నారు.  . ఒకసారి మాల్దీవుల పర్యటనకు వెళ్లినప్పుడు, అక్కడ చిన్న పిల్లలు సముద్రంలో స్వేచ్ఛగా ఈదుతుంటే తాము మాత్రం లైఫ్ జాకెట్లతో ఉండటం చూసి వారు ఈత నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పట్టుదలే నేడు వారిని అంతర్జాతీయ సరిహద్దులను దాటేలా చేసింది.  స్కిల్ నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించడమే మా లక్ష్యం అని వారు మీడియాకు తెలిపారు.

 సాంస్కృతిక వారధిగా సాహసం                              

ఈ సాహసయాత్ర కేవలం రికార్డుల కోసం మాత్రమే కాకుండా, భారత్ , శ్రీలంక దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని ప్రతిబింబించేలా నిర్వహించారు. సముద్రంలో జెల్లీ ఫిష్‌లు,  వాతావరణ మార్పులు ఇబ్బంది పెట్టినప్పటికీ, పక్కనే ఉన్న సపోర్ట్ బోట్లు , కోస్ట్ గార్డ్ సిబ్బంది పర్యవేక్షణలో వీరు లక్ష్యాన్ని చేరుకున్నారు. సోషల్ మీడియాలో తమ విజయాన్ని పంచుకున్న ఈ జంటకు నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  కొద్దిరోజుల క్రితమే ఏడేళ్ల బాలుడు ఇషాంక్ ఇదే మార్గాన్ని 9 గంటల 50 నిమిషాల్లో దాటగా, ఇప్పుడు ఈ బెంగళూరు దంపతులు జంటగా ఈ రికార్డు సాధించారు.  సాహస క్రీడల్లో భారతీయులు ప్రపంచస్థాయిలో దూసుకుపోతున్నారనడానికి ఈ విజయాలే నిదర్శనం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
Mumbai Doctor Controversy: చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
Standup Comedy Controversy: ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
Breaking News: అధికారం కోసం కాదు, బాధ్యత కోసమే కూటమి: తిరుపతి సభలో పవన్ కళ్యాణ్
అధికారం కోసం కాదు, బాధ్యత కోసమే కూటమి: తిరుపతి సభలో పవన్ కళ్యాణ్
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
Mumbai Doctor Controversy: చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
SINGA: గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
Anil Ravipudi: జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
Crime Thriller Series OTT : డబుల్ మర్డర్స్... ట్విస్టులతో ఇన్వెస్టిగేషన్ - ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
డబుల్ మర్డర్స్... ట్విస్టులతో ఇన్వెస్టిగేషన్ - ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
Meenakshi Natarajan Court Case: మీనాక్షి నటరాజన్‌ కేసు పిటిషన్‌ను ఫిర్యాదుదారుకు రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు - కేసు లేనట్లే - జరిగిపోయిన నష్టం భర్తీ ఎలా?
మీనాక్షి నటరాజన్‌ కేసు పిటిషన్‌ను ఫిర్యాదుదారుకు రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు - కేసు లేనట్లే - జరిగిపోయిన నష్టం భర్తీ ఎలా?
Standup Comedy Controversy: ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
Kadiri Shadi Mahal Dispute: కదిరిలో షాదీమహల్‌కు తాళం - ఎమ్మెల్యే కబ్జా ప్లాన్‌లో భాగమే - వైసీపీ సంచలన ఆరోపణలు
కదిరిలో షాదీమహల్‌కు తాళం - ఎమ్మెల్యే కబ్జా ప్లాన్‌లో భాగమే - వైసీపీ సంచలన ఆరోపణలు
Embed widget