By: ABP Desam | Updated at : 03 May 2022 09:08 PM (IST)
డెన్మార్ ప్రధానితో మోదీ
భారత్, యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలోనే పూర్తవుతుందని నరేంద్ర మోదీ ప్రకటించారు. మూడు రోజుల యూరప్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ డెన్మార్క్ చేరుకున్నారు. కొపెన్‌హాగన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి.. డానిష్ పీఎం మెట్టె ఫ్రెడరిక్సన్ సాదర స్వాగతం పలికారు. డానిష్ ప్రధానమంత్రి మెట్ ఫ్రెడరిక్‌సన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. కొపెన్‌హాగన్‌లోని ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. బ్యాక్‌యార్డ్‌లో నడుస్తూ చర్చలు జరిపారు. భారత్-డెన్మార్క్ ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. డెన్మార్ ప్రధాని తన ఇంటిని నరేంద్రమోదీకి చూపించారు. గతంలో భారత పర్యటనకు తనకు ప్రధాని మోదీ ఇచ్చిన పెయింటింగ్‌ను చూపించారు.
Conversations in Copenhagen aimed at boosting 🇮🇳 🇩🇰 friendship.
— PMO India (@PMOIndia) May 3, 2022
PM Frederiksen welcomed PM @narendramodi at Marienborg. @Statsmin pic.twitter.com/stQYhmtoEk
Grateful to the Indian community in Denmark for their warm reception. Addressing a programme in Copenhagen. https://t.co/PCjwh3ZM9p
— Narendra Modi (@narendramodi) May 3, 2022
ఆ తర్వాత ఇండియా- డెన్మార్ బిజినస్ ఫోరం మీటింగ్‌లో పాల్గొన్నారు. పలు రంగాల్లో ఒప్పందాలు చేసుకున్న తర్వాత రెండు దేశాల ప్రధానమంత్రులు మాట్లాడారు. భారత్-ఫసిఫిక్ తో పాటు.. ఉక్రెయిన్ ఇష్యూపైన చర్చించినట్టు మోదీ చెప్పారు. భారత్ లో మౌలిక వసతుల రంగంలో, గ్రీన్ ఇండస్ట్రీస్ లో పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయబోతున్నట్టు డానిష్ ప్రధానమంత్రి మెట్ ఫ్రెడరిక్‌సన్ చెప్పారు .
These days the term FOMO or ‘fear of missing out’ is gaining traction on social media.
— PMO India (@PMOIndia) May 3, 2022
Looking at India’s reforms and investment opportunities, I can say that those who don’t invest in our nation will certainly miss out: PM @narendramodi in Copenhagen pic.twitter.com/pAyL5TVpFb
భారత్‌లో రెండు వందల వరకూ డెన్మార్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయని ... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా వారంతా లాభాలు పొందుతున్నారని మోదీ వివరించారు. భారత్‌లో పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.
Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రత 4 డిగ్రీలదాకా ఎక్కువ నమోదయ్యే ఛాన్స్!
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
Petrol-Diesel Price, 25 May: వాహనదారులకు శుభవార్త! నేడు దిగివచ్చిన పెట్రోల్ ధరలు, ఈ సిటీలో మాత్రం స్థిరం
Gold-Silver Price: నేడు మళ్లీ పసిడి ధర షాక్! ఊహించనట్లుగా పెరిగిన బంగారం, వెండి మాత్రం కిందికి
Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Venkatesh New Movie: 'ఎఫ్ 3' తర్వాత ఏంటి? దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డ వెంకటేష్
Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత
GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్ 'కిల్లర్' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్