Breaking News: ప్రభుత్వ వాహనం, సెక్యూరిటీ వదిలేసిన మంత్రి కొండా సురేఖ- మంత్రి భట్టీతో సమావేశం
Prime Minister Modi Tour In Kurnool: ప్రధానమంత్రి మోదీ కర్నూలు జిల్లా పర్యటనతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న తాజా వార్తల కోసం ఈ పేజ్‌ను రీఫ్రెష్ చేయండి.
LIVE

Background
Prime Minister Modi Tour In Kurnool: భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటించనున్నారు. ఉదయం 10.30 సాయంత్రం ఐదు గంటల వరకు రోజుంతా కర్నూలు జిల్లాలోనే ఉంటారు ప్రధానమంత్రి మోదీ.
- 7.50 AM: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం
- 10.20 AM: కర్నూలు ఎయిర్‌పోర్ట్
- 10.25 AM: సున్నిపెంటకు హెలికాఫ్టర్
- 11.10 AM: శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరిక
- 11.45 AM: భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం
- 12.45 PM: భ్రమరాంబ గెస్ట్ హౌస్ తిరిగి చేరిక
- 1.25 PM: సున్నిపెంటకు రోడ్డు మార్గంలో బయల్దేరి
- 1.40 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక
- 2.30 PM: రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- 4.00 PM: బహిరంగ సభ
- 4.15 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక
- 4.40 PM: కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరి
- 7.15 PM: ఢిల్లీకి చేరి పర్యటన ముగింపు
కర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ. రూ.2,880 కోట్లతో కర్నూలు-3 పూలింగ్ స్టేషన్‌ను అనుసంధానించేలా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రెండు కారిడార్లలో సుమారు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనాలు వేస్తున్నాయి.
రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.ఈ పనులు విద్యుత్,…
— Narendra Modi (@narendramodi) October 15, 2025
రెండు కారిడార్ల ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని కేంద్రం ప్రకటించింది. రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్లు ఆస్కారం కల్పిస్తాయన్న కేంద్రం తెలిపింది. రూ.960 కోట్లతో సబ్బవరం-షీలానగర్ రహదారికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని. రూ.1,140 కోట్లతో పీలేరు-కాలురు నాలుగు వరుసల రహదారి విస్తరణకు శంకుస్థాపన. గుడివాడ-నూజెండ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ.
బీసీ రిజర్వేషన్ల అంశంపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ – తెలంగాణ ప్రభుత్వ SLPపై దృష్టి
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని సర్కార్ వాదించనుంది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, 42% బీసీ రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. బీసీ బిల్లులు ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందాయని, గవర్నర్, రాష్ట్రపతికి పంపించామని తెలిపింది. మూడు నెలల కంటే ఎక్కువ కాలం బిల్లులు పెండింగ్‌లో ఉంటే అవి ఆమోదం పొందినట్లేనని గతంలో సుప్రీంకోర్టు తీర్పునూ SLPలో ప్రస్తావించింది. ఈ కేసుపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
వివాదానికి పార్టీ పెద్దలే ఫుల్‌స్టాప్ పెడతారు: కొండా సురేఖ
ఎమ్మెల్యే క్వార్టర్స్ కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, తెలంగాణ పిసిసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తో తాజా పరిణామాలపై కూర్చొని సుదీర్ఘంగా చర్చలు జరిపామన్నారు. ఈ విషయంలో పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తామని హామీని ఇచ్చారని తెలిపారు. పార్టీ పెద్దలు సెటిల్ చేస్తారని పేర్కొన్నారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నట్టు వెల్లడించారు.
సీపీఎం నేతలతో టీపీసీసీ చీఫ్ మహేష్ సమావేశం- రాజకీయపరిణామాలపై చర్చ
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సిపిఎం కార్యాలయంలో సీపీఎం నేతలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చలు జరిపారు. ఈ మీటింగ్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యేజూలకంటి రంగారెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు టి.జ్యోతి, బండారు రవికుమార్, టి.సాగర్, ఎండి అబ్బాస్, డీజీ నరసింహారావు, పి. ఆశయ్య పాల్గొన్నారు.





















