అన్వేషించండి

No Tax : విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు వేసే హక్కు లేదు - రాష్ట్రాలకు కేంద్రం లేఖ !

విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు వేసే అధికారం రాష్ట్రాలకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. అలాంటి పన్నులను ఉపసంహరించాలని ఆదేశించింది.

No Tax :   విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు వేసే అధికారం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర విద్యుత్ శాఖ ఓ లేఖ రాసింది. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు, సుంకాలు విధిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది.  థర్మల్, హైడ్రో, విండ్, సోలార్, న్యూక్లియర్  ఏ రకంగా చేసినప్పటికీ దానిపై పన్నులు విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.                   
No Tax :  విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు వేసే హక్కు లేదు - రాష్ట్రాలకు కేంద్రం లేఖ !

రాష్ట్రాలు ఏయే అంశాలపై పన్నులు విధించవచ్చో రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో పొందుపరిచి ఉంది.  అందులో పేర్కొన్న జాబితాలో లేని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రూపంలోనూ పన్నులు విధించడం కుదరదని తేల్చి చెప్పింది. 7వ షెడ్యూల్‌లోని జాబితాలో లేని ఏ అంశమైనా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకే వస్తుందని రాజ్యాంగం చెబుతోందని వెల్లడించింది. లిస్ట్-2లో ఎంట్రీ 53 ప్రకారం ఆయా రాష్ట్రాల పరిధిలో విద్యుత్ వినియోగం, అమ్మకంపై మాత్రమే రాష్ట్రాలు పన్న్నులు విధించుకోవచ్చని స్పష్టం చేసింది. 

ఒక రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన విద్యుత్తు మరో రాష్ట్రంలో వినియోగించే అవకాశం ఉన్నందున, విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు విధించినట్లయితే అది మరో రాష్ట్రంలోని ప్రజలపై పన్ను విధించినట్టే అవుతుందని, ఏ రాష్ట్రానికీ మరో రాష్ట్రంలో ప్రజలపై పన్నులు విధించే అధికారం లేదని వివరించింది. అలాగే రాజ్యాంగంలోని 286వ అధికరణం ప్రకారం రాష్ట్ర పరిధి దాటి సాగే సరఫరాపై ఎలాంటి వస్తు, సేవల పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు లేదని కేంద్రం తెలియజేసింది. అలాగే ఆర్టికల్ 287, 288 ప్రకారం కేంద్ర ప్రభుత్వం వినియోగించే లేదా కొనుగోలు చేసే విద్యుత్తుపై రాష్ట్రాలు పన్నులు విధించడం కుదరదని పేర్కొంది.
No Tax :  విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు వేసే హక్కు లేదు - రాష్ట్రాలకు కేంద్రం లేఖ !

కొన్ని రాష్ట్రాలు జల విద్యుత్తు ఉత్పత్తిపై పన్నులు విధిస్తున్నాయని, రాజ్యాంగంలో 56వ ప్రవేశిక ప్రకారం అంతర్రాష్ట్ర నదులు కేంద్రం పరిధిలో ఉంటాయని వెల్లడించింది. అలాంటి నదులపై నిర్మించిన జలవిద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తుపై పన్నులు వేసే అధికారం రాష్ట్రాలకు లేదని వెల్లడించింది. జల విద్యుత్తు కేంద్రాలు విద్యుదుత్పత్తి కోసం నీటిని ఖర్చు చేయవని, కేవలం నీటి ప్రవాహం టర్బైన్లను తిప్పడం ద్వారా మాత్రమే విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని స్పష్టం చేసింది.

ఇదే సూత్రం పవన విద్యుత్తుకు కూడా వర్తిస్తుందని, గాలి ద్వారా టర్బైన్లు తిరిగి విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని పేర్కొంది. అలాంటప్పుడు నీటి సెస్, గాలి సెస్ పేరుతో పన్ను విధించడం సమంజసం కాదని తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపంలోనూ విద్యుత్తు ఉత్పత్తిపై పన్నులు విధించకూడదని, ఒకవేళ ఇప్పటికే విధించినట్టయితే తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్రం ఆదేశించింది. కొన్ని రాష్ట్రాలు ఇలా టాక్స్‌లు విధించడం వల్లనే కేంద్రం ఇలా హెచ్చరికలు జారీ చేసిందని భావిస్తున్నారు. ఆ రాష్ట్రాలేమిటన్నది లేఖలో చెప్పలేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Jr NTR: ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
Embed widget