PM Modi YouTube Channel: అందులో కూడా మోదీయే నం.1.. మరెవురివల్లా కాలేదు.. అయ్యగారే నం.1!
ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డ్ సృష్టించారు. ఆయన యూట్యూబ్ ఛానల్ కోటి సబ్‌స్క్రిప్షన్‌లు దాటింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా మోదీ మరో రికార్డ్ సృష్టించారు. వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో ప్రధాని మోదీ ఛానల్ రికార్డు సృష్టించింది. ఆయన యూట్యూబ్ ఛానల్ కోటి సబ్‌స్క్రిప్షన్‌లను దాటింది.
మోదీయే నం.1..
ప్రపంచంలోనే అగ్రశ్రేణి నాయకుల్లో అత్యధిక సబ్స్క్రైబర్లను కలిగిన రికార్డ్‌ను మోదీ నెలకొల్పారు. ప్రపంచంలోని ఇతర దేశాధినేతలందరి కంటే ఇదే అత్యధికం.
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు చెందిన యూట్యూబ్ ఛానల్ 36 లక్షల సబ్స్క్రైబర్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ లోపేజ్ ఉన్నారు. ఆయన యూట్యూబ్ చానెల్‌కు 30.7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే భారత ప్రధాని మోదీకి ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది.
ఆ తర్వాత ఎవరు?
- ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొలకు 28.8 లక్షలు.
- యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌కు 7.03 లక్షలు.
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఛానల్‌కు 5.25 లక్షల సబ్‌స్క్రిప్షన్‌లు.
- శశి థరూర్ ఛానల్‌కు 4.39 లక్షల సబ్‌స్క్రైబర్లు.
- ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి 3.73 లక్షల సబ్‌స్క్రైబర్లు
- తమిళనాడు సీఎం స్టాలిన్ ఛానల్‌కు 2.12 లక్షలు.
ప్రజాదరణ కలిగిన నేతగా..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల జాబితాలో మరోమారు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల టాప్‌లో నిలిచారు. వరల్డ్ మోస్ట్ పాపులర్ లీడర్ ఎవరనే అంశంపై నిర్వహించిన సర్వేలో మోదీ అగ్రస్థానంలో నిలిచి సత్తాచాటారు. కరోనా కష్టకాలంలోనూ ప్రపంచలో ప్రజాదరణ కలిగిన నేతల్లో తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నారు. మార్నింగ్ కన్సల్ట్ అనే డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతలపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అందులో ప్రధాని మోదీ టాప్‌లో నిలవగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో ఉండడం విశేషం.
Also Read: Income Tax, Union Budget 2022: ఆదాయ పన్ను! మనం ఏం అడిగాం? నిర్మలమ్మ ఏం వడ్డించింది...?
Also Read: Budget 2022: గుడ్ న్యూస్.. 80 లక్షల ఇళ్ల నిర్మాణం.. రూ.44 వేల కోట్లు కేటాయింపు