News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

PM Modi UNGA Speech: 'తీరు మార్చుకోకపోతే ఇక అంతే'.. ఐరాస పనితీరుపై మోదీ చురకలు

ఐక్యరాజ్యసమితికి ప్రధాని నరేంద్ర మోదీ చురకలంటించారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు మారాలని సూచించారు.

FOLLOW US: 
Share:

ఐక్యరాజ్యసమితి 76వ జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఐరాసకు కూడా మోదీ చురకలంటించారు. ఐక్యరాజ్యసమితి ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు మార్పు చెందాలన్నారు. ఈ సందర్భంగా చాణక్యుడు వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు. 

" సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే.. అదే వైఫల్యానికి దారి తీస్తుంది. ప్రస్తుత ప్రపంచానికి తగ్గుట్లు ఐరాస ఉండాలనుకుంటే తమ విశ్వసనీయత, సమర్థతను మెరుగుపర్చుకోవాల్సిందే. వాతావరణ మార్పులు, కరోనా సంక్షోభ సమయంలో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థపై పలు ప్రశ్నలు తలెత్తాయి. కరోనా కారణంగా డబ్ల్యూహెచ్ఓ పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా డబ్ల్యూహెచ్ఓను చైనా చేతిలో కీలుబొమ్మ అని వ్యాఖ్యానించారు. పలు దేశాల్లో జరుగుతోన్న అంతర్యుద్ధాలు, పరోక్ష యుద్ధాలు, ఉగ్రవాదం, అఫ్గానిస్థాన్‌లో తాజా పరిణామాలు చూస్తే ఈ ప్రశ్నల గంభీరత మరింత పెరుగుతోంది. కరోనా పుట్టుక, సులభతర వాణిజ్య ర్యాంకింగులు, ప్రపంచస్ఖాయి సంస్థల పనితీరులో లోపం ఇవన్నీ.. ఎన్నో దశాబ్దాలుగా మీరు నిర్మించుకున్న విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఐరాసను నిరంతరం బలోపేతం చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టాలు, విలువలను కాపాడగలిగిన వాళ్లమవుతాం.                                                     "
-ప్రధాని నరేంద్ర మోదీ

భారత అభివృద్ధి..

భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని మోదీ వ్యాఖ్యానించారు. భారత్​లో సంస్కరణలు తీసుకొస్తే ప్రపంచం రూపాంతరం చెందుతుందన్నారు.

" ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత వైవిధ్యంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఇది కరోనా మహమ్మారి మనకు నేర్పించింది. అందుకే గ్లోబల్ వేల్యూ చైన్ విస్తరణ జరగడం ముఖ్యం. దీని ఆధారంగానే మా 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' రూపొందింది. 'అంత్యోదయ' అనే సూత్రంతో భారత్ ముందుకు సాగుతోంది. అభివృద్ధి అనేది సమ్మిళితంగా, సర్వవ్యాప్తంగా ఉండాలి.             "
-     ప్రధాని నరేంద్ర మోదీ

Also Read:Sneha Dubey: ఇమ్రాన్‌కు దిమ్మతిరిగే షాక్.. తెల్లబోయిన పాక్.. ఆమె ఎవరో తెలుసా?                  

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 25 Sep 2021 11:16 PM (IST) Tags: COVID-19 Pandemic Pakistan Narendra Modi Prime Minister COVID-19 pandemic united nations general assembly terrorism 76th session

ఇవి కూడా చూడండి

Manipur Violence: మణిపూర్‌లో ఆర్నెల్ల పాటు అఫ్‌స్పా చట్టం అమలు, అల్లర్లు అదుపులోకి వస్తాయా?

Manipur Violence: మణిపూర్‌లో ఆర్నెల్ల పాటు అఫ్‌స్పా చట్టం అమలు, అల్లర్లు అదుపులోకి వస్తాయా?

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌ అక్టోబరు 3కి వాయిదా - ఆరోజు అన్ని వివరాలు వింటామన్న సీజేఐ

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌ అక్టోబరు 3కి వాయిదా - ఆరోజు అన్ని వివరాలు వింటామన్న సీజేఐ

తమిళనాడు కర్ణాటక మధ్య ముదురుతున్న కావేరీ జల వివాదం - ఎవరి వాదన వారిదే!

తమిళనాడు కర్ణాటక మధ్య ముదురుతున్న కావేరీ జల వివాదం - ఎవరి వాదన వారిదే!

నేనో సీనియర్ లీడర్‌ని, చేతులు జోడించి ఓట్లు అడుక్కోవాలా - బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

నేనో సీనియర్ లీడర్‌ని, చేతులు జోడించి ఓట్లు అడుక్కోవాలా - బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Renovation Loan: మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి - రెనోవేషన్‌ లోన్‌ రేట్లు, టాక్స్‌ బెనిఫిట్స్‌ ఇవిగో!

Renovation Loan: మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి - రెనోవేషన్‌ లోన్‌ రేట్లు, టాక్స్‌ బెనిఫిట్స్‌ ఇవిగో!

టాప్ స్టోరీస్

Supreme Court: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరో బెంచ్‌కు

Supreme Court: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరో బెంచ్‌కు

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Ravi Teja Eagle Release Date : సంక్రాంతి బరిలో రవితేజ 'ఈగల్' - పండక్కి మొండోడు వస్తున్నాడు

Ravi Teja Eagle Release Date : సంక్రాంతి బరిలో రవితేజ 'ఈగల్' - పండక్కి మొండోడు వస్తున్నాడు

Salman Khan Tiger 3 : 'టైగర్ 3'తో సల్మాన్ 1000 కోట్లు కొడతాడా? - ఇండియాలో వెయ్యి కోట్ల హీరోలు ఎవరో తెలుసా?

Salman Khan Tiger 3 : 'టైగర్ 3'తో సల్మాన్ 1000 కోట్లు కొడతాడా? - ఇండియాలో వెయ్యి కోట్ల హీరోలు ఎవరో తెలుసా?