PM Modi On Diwali: 'మేము యుద్ధాన్ని కోరుకోం- కానీ మా జోలికి వస్తే మాత్రం ఊరుకోం'
PM Modi On Diwali: భారత్ బలంగా ఉన్నప్పుడు ప్రపంచం కూడా శాంతి, శ్రేయస్సులతో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
PM Modi On Diwali: జవాన్లతో కలిసి దీపావళిని జరుపుకోవడం తనకు మరింత ప్రత్యేకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం కార్గిల్ ప్రాంతంలో సైనికులతో కలిసి మోదీ దీపావళిని జరుపుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో జవాన్లతో కలిసి దీపావళిని జరుపుకునే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈ ఏడాది కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా కార్గిల్‌లో సైనికులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
భారత్ శక్తి
బయటా, లోపలా శత్రువులతో విజయవంతంగా వ్యవహరిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు.
యుద్ధం కోరుకోం
భారత్ ఎన్నడూ యుద్ధం కోరుకోదని కానీ తమ జోలికి వస్తే మాత్రం వదిలి పెట్టమని సరిహద్దు దేశాలకు ప్రధాని మోదీ పరోక్ష హెచ్చరికలు చేశారు.
#WATCH | We've never viewed war as first option...Be it the war in Lanka or Kurukshetra, we tried till last to postpone it. We're against war but peace can't be there without strength. If anyone dares to look at us with evil eyes, our armed forces will give a befitting reply: PM pic.twitter.com/pW4O79KpMT
— ANI (@ANI) October 24, 2022
Also Read: UK Next PM: రిషికి కలిసొచ్చిన దీపావళి- ప్రధాని రేసు నుంచి బోరిస్ జాన్సన్ ఔట్!