(Source: ECI/ABP News/ABP Majha)
Chintan Shivir: వన్ నేషన్- వన్ పోలీస్ యూనిఫాం: ప్రధాని మోదీ
Chintan Shivir: ఒకే దేశం- ఒకే పోలీస్ యూనిఫాం ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రస్తావించారు.
Chintan Shivir: దేశవ్యాప్తంగా పోలీసులను ఒకే రీతిలో చూడాలన్నదే తన కోరికని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం పోలీసులు అందరికీ ఒకే రకమైన యూనిఫాం ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రాల హోం మంత్రులతో జరిగిన చింతన్ శిబిర్‌లో ఆయన ఈ ప్రతిపాదన ఉంచారు.
హక్కులు కాపాడాలి
హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. రెండ్రోజుల పాటు అన్ని రాష్ట్రాల హోం మంత్రులతో ఈ సమావేశం సాగనుంది. ఈ సందర్భంగానే ఆయా రాష్ట్రాల్లోని శాంతిభద్రతల గురించి ప్రస్తావించారు.
#WATCH | "For safety & rights of law-abiding citizens, stringent action against negative forces is our responsibility...Small piece of fake news can kick up a storm across the nation...We'll have to educate people to think before forwarding anything, verify before believing it.." pic.twitter.com/NHF3emMq5S
— ANI (@ANI) October 28, 2022
ఈ కార్యక్రమంలో హోం సెక్రటరీలు, డీజీపీలు, Central Armed Police Forces డైరెక్టర్ జనరల్స్, Central Police Organisations డైరెక్టర్ జనరల్స్ హాజరవుతారు. దేశ అంతర్గత భద్రతను పటిష్ఠం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ సమావేశంలో చర్చిస్తారు. పోలీస్ ఫోర్స్‌ను నవీకరించటం సహా సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్, సరిహద్దు వివాదాల పరిష్కారం, తీరప్రాంత పరిరక్షణ, మహిళా భద్రత, డ్రగ్ ట్రాఫికింగ్ లాంటి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Also Read: Jammu Kashmir: ప్రాణ భయంతో గ్రామాన్ని విడిచిపెట్టిన చివరి కశ్మీరీ పండిట్!