PM Modi: జై విజ్ఞాన్ జై అనుసంధాన్, కొత్త నినాదాలు తెరపైకి తెచ్చిన ప్రధాని మోదీ
Centre-State Science Conclave: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెంటర్ స్టేట్ సైన్స్ కాన్‌క్లేవ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

Centre-State Science Conclave:
సబ్‌కా ప్రయాస్‌కు ఇది నిదర్శనం: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ Centre-State Science Conclaveని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆ తరవాత కీలక ప్రసంగం చేశారు. "ఇండియా జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ మంత్రంతో ముందుకెళ్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు. సైంటిస్ట్‌లు సాధించే విజయాల్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలని, ఇలా చేసినప్పుడే సైన్స్ అనేది మన సంస్కృతిలో ఓ భాగం అవుతుందని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం సైన్స్ ఆధారిత అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సెంటర్ స్టేట్ సైన్స్ కాన్‌క్లేవ్ గురించి ప్రస్తావించారు. ఇది సబ్‌కా ప్రయాస్‌కు ప్రత్యక్ష సాక్ష్యం అని కొనియాడారు. ఇండియా నాలుగో అతి పెద్ద పారిశ్రామిక శక్తిగా ఎదిగిందని, ఇక్కడి సైన్స్, సైంటిస్ట్‌లకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గుజరాత్‌లోని స్టార్టప్ వెంచర్స్ గురించి సీఎం భూపేంద్ర పటేల్ ప్రస్తావించారు. "యువత కోసం అవసరమైన సైన్స్ అండ్ టెక్నాలజీకి అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాం" అని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో...ఉద్యోగాల కల్పనతో పాటు ఆవిష్కరణలను ప్రమోట్ చేస్తున్నట్టు చెప్పారు. మూడేళ్లుగా ఇండియాలో స్టార్టప్‌ల విషయంలో గుజరాత్ అగ్రస్థానంలో ఉంటోందని గుర్తు చేశారు.
Centre-State Science Conclave is an example of our mantra of Sabka Prayas. Today, as India moves towards leading the fourth industrial revolution, the role of India's science and people associated with this field is very important: PM Narendra Modi https://t.co/nJqBMGvG59 pic.twitter.com/sp7Ha0o4rk
— ANI (@ANI) September 10, 2022
PM Narendra Modi to shortly inaugurate the Centre- State Science Conclave through video conferencing.
— ANI (@ANI) September 10, 2022
The two-day Conclave is being organised at Science City, Ahmedabad. It will include sessions on different thematic areas including STI Vision 2047. pic.twitter.com/Gt1HXhjxvG
ఈ అంశాలపైనే చర్చ
ఈ తరహా కాన్‌క్లేవ్‌లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ముఖ్యంగా...శాస్త్ర, సాంకేతికత రంగాల్లో పురోగతి సాధించేందుకు ఈ సహకారం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయటంలోనూ తోడ్పడుతుంది. ఇది దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ...ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్టు కేంద్రం వివరిస్తోంది. సైన్స్ సిటీగా పేరొందిన అహ్మదాబాద్‌లో రెండ్రోజుల పాటు సాగనుంది ఈ కాన్‌క్లేవ్. STI విజన్ 2047, అందరికీ డిజిటల్ హెల్త్ కేర్, 2030 నాటికి ప్రైవేట్ సెక్టార్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పెట్టుబడులను రెట్టింపు చేయటం, వ్యవసాయంలో సాంకేతిక ఆవిష్కరణలు, రైతుల ఆదాయం పెంచటం లాంటి అంశాలపై చర్చిస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రి సహా...సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబందించిన మంత్రులు, ఎగ్జిక్యూటివ్‌లు, ఎన్‌జీవోలు, యువ సైంటిస్ట్‌లు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొంటారు.
Also Read: History of Zero: సున్నా గురించి ముందుగా తెలిసింది భారతీయులకే, ఆధారాలివిగో!





















