Bihar Vaccine Scam : బీహార్‌లో అంతే.. ! మోడీ, షా, ప్రియంక ఎవరికైనా వ్యాక్సిన్ వేసేస్తారు.. రికార్డుల్లో !
బీహార్ ప్రభుత్వం 8 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ వేశామని ప్రకటించింది. కానీ వారి లిస్టులో మోడీ, షా , ప్రియాంక ,సోనియా వంటి వారు కనిపించారు. ఇదేం వ్యాక్సినేషన్ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఏబీసీడీలు రాని వాళ్లు ఇంగ్లిష్ ఎగ్జామ్‌లో ఎక్కడ టాపర్ అవుతారు ?. సబ్జెక్ట్ గురించి తెలియని వాళ్లకు ఎక్కడ పీహెచ్‌డీ సునాయాసంగా వస్తుంది ?. పేపర్లో ఏమి రాశారో కూడా తెలియకుండానే ఎక్కడ ఉద్యోగం ఇస్తారు ?... వీటన్నింటికీ మనకు తెలిసిన సమాధానంగా బీహార్ చెప్పుకోవచ్చు. వాటి కోవలోనే ఇప్పుడు వ్యాక్సిన్ వ్యవహారం కూడా ఒకటి తెరపైకి వచ్చింది. అదేమిటంటే దేశంలో ఉన్న సెలబ్రిటీలంతా బీహార్‌లోనే వ్యాక్సిన్స్ వేయించుకున్నారట. ప్రధాని మోడీ, అమిత్ షా, ప్రియాంక చోప్రా, సోనియాలు ఈ జాబితాలో ఉన్నారు. వారెవరికీ అక్కడ స్థిరనివాసం లేదు.. కనీసం నివాసం లేదు.. మరి వ్యాక్సిన్వేయించుకోవడానికి అక్కడికి వెళ్లారా అని ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే వారక్కడ వ్యాక్సిన్ వేయించుకోలేదు. మరి రికార్డుల్లోకి ఎలా వచ్చాయంటే.. అదే బీహార్ మ్యాజిక్ .
Also Read : రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు
బీహార్ ప్రభుత్వం 8 కోట్ల మందికి టీకాలు వేసినట్టుగా ప్రకటించేసుకుంది. అంత గొప్పగా వ్యాక్సినేషన్ జరిగిందా అని కొంత మంది ఫ్యాక్ట్ చెక్ చేశారు. బీహార్‌లోని అర్వాల్ జిల్లాలోని కర్పిలోని అదనపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు చనిపోయిన వ్యక్తులకు రెండు డోసుల ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. అలాగే ఇతర చోట్ల కూడా అదే పరిస్థితి. ఇలాచెక్ చేస్తున్న సమయంలోనే ప్రధాని మోడీ, అమిత్ షా , ప్రియాంక, సోనియా వంటి వారి పేర్లు కూడా రెండు డోసులు తీసుకున్న వారి జాబితాలో కనిపించాయి.
Also Read : జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగులకు ఊస్టింగ్ .. "బెట్టర్" సీఈవో వరస్ట్ డెసిషన్ !
పాట్నాలోనూ మొదటి డోసు తీసుకున్నవారి పేర్లు సైతం రెండు డోసులు తీసుకున్న వారి జాబితాలో చేర్చారనీ, పోర్టల్‌లోనూ అప్‌లోడ్ చేశారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. చనిపోయిన వారికి టీకాలు అందించినట్టుగా వారి కుటుంబ సభ్యుల ఫోన్లకు మెసేజ్‌లు సైతం అందాయి. దీంతో మొత్తం బీహార్‌లో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియపైనే అనుమానాలు ప్రారంంభమవుతున్నాయి. కేంద్రం వ్యాక్సిన్లను దుర్వినియోగం చేసి.. ఇలా తప్పుడు లెక్కలతో మభ్య పెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read : 'కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు'.. హైకోర్టు సంచలన తీర్పు
బీహార్‌లో ఇలాంటి అవకతవకలు సహజంగా జరుగుతూ ఉంటాయి. ప్రశ్నాపత్రాల లీకేజీ దగ్గర్నుంచి ఏ విషయంలోనూ అక్కడ వ్యవస్థలు సరిగ్గా పని చేయవన్న విమర్శలు ఉన్నాయి. గతంలో కరోనా టెస్టింగ్ విషయంలోనూ అదే తరహా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలోనూ అదే తంతు. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఎప్పట్లాగే ఏమీ తేలదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Also Read : 2 కోట్ల మంది అకౌంట్ పీకేసిన వాట్సాప్ ! ఎందుకు..? ఏమిటి? ఎలా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి