PM Modi Oath Ceremony: మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఖర్గే, అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్
PM Modi Cabinet: ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ తరపున మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు.
![PM Modi Oath Ceremony: మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఖర్గే, అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ PM Modi Oath Taking Ceremony Mallikarjun Kharge to attend oath ceremony PM Modi Oath Ceremony: మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఖర్గే, అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/8dd6aa4b69ba8ae099c510d258ba813a1717926511772517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi Swearing In: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధికారికంగా ఈ విషయం వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పలువురు ప్రతిపక్ష నేతలకూ ఆహ్వానం అందించింది. ఈ జాబితాలో ఖర్గే ఉన్నారు. I.N.D.I.A కూటమిలోని మిగతా పార్టీల నేతల్ని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ వెల్లడించింది. అటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. కానీ ఆమె హాజరయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని, తనకు వెళ్లాలని లేదని తేల్చి చెప్పారు.
After discussing with the party and allies, Congress President and LoP in Rajya Sabha, Mallikarjun Kharge has decided to attend the swearing-in ceremony of PM-designate Narendra Modi at Rashtrapati Bhavan today: Sources
— ANI (@ANI) June 9, 2024
(file pic) pic.twitter.com/6h3MiFUd50
అంతకు ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా (Leader of Opposition) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందుకు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టినట్టు కాంగ్రెస్ సీనియర్ నేతలు వెల్లడించారు. ఇక సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. సీనియర్ నేతలు ఈ పదవి తీసుకోవాలని ప్రతిపాదన తీసుకురాగా సోనియా అందుకు అంగీకరించారు.
సాయంత్రం 7.15 నిముషాలకు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని కర్తవ్యపథ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే మోదీ రాజ్‌ఘాట్‌కి వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఆ తరవాత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి శ్రద్ధాంజలి ఘటించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)