PM Modi US Visit: క్వాల్కమ్ సీఈఓ, అడోబ్ ఛైర్మన్‌తో మోదీ భేటీ.. 'డిజిటల్ ఇండియాకు' జై
గ్లోబల్ సీఈఓలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా, 5జీ సాంకేతికతపై చర్చలు జరిపారు.
అమెరికా పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల సీఈఓలతో ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. క్వాల్కమ్ సంస్థ అధ్యక్షుడు, సీఈఓ క్రిస్టియానో ఆమోన్తో వాషింగ్టన్లో ఆయన సమావేశమయ్యారు.
Talking technology...
— PMO India (@PMOIndia) September 23, 2021
President and CEO of @Qualcomm, @cristianoamon and PM @narendramodi had a productive interaction. PM Modi highlighted the vast opportunities India offers. Mr. Amon expressed keenness to work with India in areas such as 5G and other @_DigitalIndia efforts. pic.twitter.com/kKcaXhpFtB
క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానో ఆమోన్తో నిర్మాణాత్మక చర్చలు జరిగినట్లు మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ అందిస్తున్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. 5జీ, డిజిటల్ ఇండియా రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు అమోన్ పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
" ప్రధాని మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. భారత్‌తో భాగస్వామి కావడం గర్వంగా ఉంది. 5జీ సాంకేతికత గురించి మేం మాట్లాడాం. భారత్‌లో 5జీ విస్తరణకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. "
-క్రిస్టియానో, క్వాల్కమ్ సీఈఓ
అడోబ్ ఛైర్మన్‌తో..
Mr. Shantanu Narayen, Chairman, President and CEO of @Adobe met PM @narendramodi. Discussions focussed on leveraging technology to provide smart education to youngsters and enhance research. They also discussed the vibrant start-up sector in India, powered by the Indian youth. pic.twitter.com/oNTY95nrV0
— PMO India (@PMOIndia) September 23, 2021
అనంతరం అడోబ్ ఛైర్మన్ శంతను నారాయణ్‌తో భేటీ అయ్యారు. ఫస్ట్ సోలార్ సంస్థ సీఈఓ మార్క్ విడ్మర్‌తో చర్చలు జరిపారు. సీఈఓలతో సమావేశం సందర్భంగా భారత్ కల్పిస్తున్న విస్తృత వ్యాపార అవకాశాలను ప్రస్తావించారు మోదీ.