(Source: ECI/ABP News/ABP Majha)
Water Metro in India: పడవల్లాంటి మెట్రోలు వచ్చేస్తున్నాయ్,మన దేశానికే ఇది వెరీ స్పెషల్
Water Metro in India: కేరళలోని కొచ్చిలో తొలి వాటర్ మెట్రోని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
Water Metro in India:
ఏప్రిల్ 25న ప్రారంభం
కేరళ పర్యటనలో భాగంగా అక్కడి ప్రజలకు ఓ గిఫ్ట్ ఇవ్వనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటికే పలు చోట్ల వందేభారత్ ట్రైన్‌లను ప్రారంభించిన ఆయన...వాటర్ మెట్రో (Water Metro Project)ని దేశానికి అంకితం చేయనున్నారు. భారత్‌లో ఇదే తొలి వాటర్ మెట్రో. కేరళలోని నగరాల మధ్య రవాణాను మరింత సులభతరం చేయనున్నాయి ఈ వాటర్ మెట్రో సర్వీస్‌లు. సాధారణ మెట్రో రైళ్లో ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో...ఇందులోనూ అంతే సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు అధికారులు. మెట్రో సర్వీస్‌లను దేశవ్యాప్తంగా పెంచాలన్నది మోదీ సర్కార్ లక్ష్యం. అయితే...కొన్ని చోట్ల ఆ సేవల్ని అందించేందుకు భౌగోళికంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో ఈ సమస్య ఎదురైంది. అందుకే...మెట్రో అంటే కేవలం ఒకే డిజైన్‌లో ఎందుకుండాలి..? నీళ్లపైనా నడిచేలా రూపొందించలేమా..? అన్న ఆలోచన తెరపైకి వచ్చింది. అందులో భాగంగానే చాలా డిజైన్‌లు పరిశీలించి చివరకు ఈ వాటర్ మెట్రోని తీసుకొచ్చారు. మెట్రో కనెక్టివిటీని పెంచేందుకు ఇలా వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సాధారణ మెట్రోకి దీనికి గల తేడా ఏమిటో అధికారులు వివరిస్తున్నారు. ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్‌ని "Metro Lite"గా పిలుస్తున్నారు.
"ర్యాపిడ్ ట్రానిస్ట్ సిస్టమ్‌లో భాగంగా చాలా తక్కువ ఖర్చుతో ఈ మెట్రో లైట్‌ని రూపొందించాం. పట్టాలపై నడిచే మెట్రోలో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అన్నీ ఇందులోనూ ఉంటాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీటింగ్‌ని డిజైన్ చేశాం. నీళ్లపై నడిచే మెట్రో కాబట్టి సేఫ్‌టీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాం. పంక్చువాలిటీ విషయంలోనూ కచ్చితంగా ఉంటుంది. పైగా ఎన్విరాన్‌మెంటల్ ఫ్రెండ్లీ కూడా. సాధారణ మెట్రో కోసం చేసే ఖర్చులో 40%తోనే ఈ మెట్రో లైట్‌ని తయారు చేసుకోవచ్చు. జమ్ము, శ్రీనగర్, గోరఖ్‌పూర్‌లోనూ ఈ ప్రాజెక్ట్‌ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. "
- అధికారులు, వాటర్ మెట్రో ప్రాజెక్ట్
ధర తక్కువే..
Tier-2 సిటీల్లో ఈ తరహా మొబిలిటీ ఉంటే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. రోడ్డు మార్గంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ట్రాన్స్‌పోర్ట్‌ని ఎంచుకునే వీలుటుందని చెబుతోంది. చూడటానికి పడవలానే ఉంటుంది ఈ వాటర్ మెట్రో. మొత్తం 8 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ మెట్రోలు అందుబాటులోకి రానున్నాయి. రెండు మార్గాల్లో ఈ సర్వీస్‌లు ప్రారంభమవుతాయి. హైకోర్టు నుంచి వైపిన్‌కి రూ.20 టికెట్ ధరని ఫిక్స్ చేశారు. ఇక విట్టిలా నుంచి కక్కనడ్ రూట్‌లో ప్రయాణించే వాళ్లు రూ.30 టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మరో స్పెషాల్టీ ఏంటంటే...వీక్‌లీ, మంత్‌లీ, క్వార్టర్‌లీ పాసెస్ కూడా ఇస్తారు. ఏప్రిల్ 26 నుంచి ఈ సర్వీస్‌లు ప్రారంభమవుతాయి. అరగంట లోపే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. డిజిటల్ టికెట్స్‌నీ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. Kochi 1 కార్డ్ ద్వారా అటు సాధారణ మెట్రోతో పాటు వాటర్ మెట్రోలనూ ప్రయాణించే వీలుంటుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
Also Read: Cheetah Dies: మరో విషాదం - మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి