Parliament Winter Session: చైనాపై చర్చకు సభాపతి నో- రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్!
Parliament Winter Session: భారత్- చైనా సైనికుల ఘర్షణపై చర్చకు రాజ్యసభ ఛైర్మన్ నిరాకరించడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
![Parliament Winter Session: చైనాపై చర్చకు సభాపతి నో- రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్! Parliament Winter Session Opposition Walks Out Of Rajya Sabha After Chair Rejects discussion On Chinese Incursions Parliament Winter Session: చైనాపై చర్చకు సభాపతి నో- రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/16/595ab2aeeb8d8db68bfc00e8147f57621671155338516470_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Parliament Winter Session: చైనా, భారత్ మధ్య సరిహద్దులో జరిగిన తాజా ఘర్షణపై చర్చకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్షాలు.. ఉభయ సభల్లో మరోసారి పట్టుబట్టాయి. ఈ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు.. రాజ్యసభ ఛైర్మన్‌ను కోరాయి. కానీ ఇందుకు సభాపతి నిరాకరించడంతో విపక్ష సభ్యులంతా ఉమ్మడిగా సభ నుంచి వాకౌట్ చేశారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో జరిగిన భారత్ చైనా సైనికుల ఘర్షణ తర్వాత నుంచి ప్రతిపక్షాలు ఈ అంశంపై చర్చకు ఉభయ సభలలో పట్టు పడుతున్నాయి.
రక్షణ శాఖ
రక్షణ మంత్రిత్వ శాఖ గత శనివారం తన సంవత్సరాంతపు సమీక్షలో భారత సైన్యం.. ఆయుధ ఆధునీకరణ సహా పలు అంశాలపై మాట్లాడింది.
ఇదీ జరిగింది
డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ జరిగింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిన.. చైనా జవాన్లను మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి.
ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రకటన చేశారు.
Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై డ్రోన్‌లతో రష్యా భీకర దాడులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)