By: Ram Manohar | Updated at : 13 Mar 2023 12:32 PM (IST)
రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. (Image Credits: ANI)
Rajnath Singh on Rahul Gandhi:
పార్లమెంట్‌లో రెండో విడత బడ్జెట్ సమావేశాలు మొదలైన కాసేపటికీ రెండు సభలనూ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. యూకేకు వెళ్లి అక్కడ భారత్ గురించి తక్కువ చేసి మాట్లాడతారా అంటూ మండి పడ్డారు. పార్లమెంట్ సభ్యుడైన రాహుల్.. లండన్‌లో భారత్ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేయడం వల్ల సభ సజావుగా ముందుకెళ్లలేదు. ఫలితంగా వెంటనే వాయిదా వేశారు.
"పార్లమెంట్ సభ్యుడైనా రాహుల్ గాంధీ లండన్‌లో భారత్ ప్రతిష్ఠను దిగజార్చారు. సభలోని వాళ్లంతా ఆ వ్యాఖ్యల్ని ఖండించాలని డిమాండ్ చేస్తున్నాను. రాహుల్ అందరికీ క్షమాపణలు చెప్పాల్సిందే"
- రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి
Rahul Gandhi, who is a member of this House, insulted India in London. I demand that his statements should be condemned by all members of this House and he should be asked to apologise before the House: Defence Minister Rajnath Singh in Lok Sabha pic.twitter.com/62GRnx2qbd
— ANI (@ANI) March 13, 2023
Lok Sabha | Union minister Pralhad Joshi speaks on Congress MP Rahul Gandhi's speech made in London.
— ANI (@ANI) March 13, 2023
In protest, Opposition leaders come into the well of the House.
House adjourned till 2pm amid ruckus by MPs. pic.twitter.com/YG6CS31Bdf
యూకేలో రాహుల్ వ్యాఖ్యలపై విమర్శలు..
బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. యూకేలో భారత్‌పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన ఆమె..రాహుల్‌ను దేశం నుంచి తరిమేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వారం యూకేలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ...లోక్‌సభలో ప్రతిపక్ష మైక్‌లు ఆఫ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. దీనిపై ఇప్పటికే బీజేపీ నేతలంతా మండి పడుతున్నారు. పరాయి దేశంలో మన దేశాన్ని కించపరుస్తూ మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రగ్యా ఠాకూర్ కూడా తీవ్రంగా స్పందించారు. విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి ఎప్పటికీ భారత దేశ భక్తుడు కాలేడంటూ పరుషంగా మాట్లాడారు.
"విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి కదా. ఆయన ఎప్పటికీ భారత దేశ భక్తుడు కాలేడు. రాహుల్ గాంధీ మరోసారి ఆ వ్యాఖ్యలతో ఇది నిరూపించారు. రాహుల్..మిమ్మల్ని మేమెప్పుడూ భారత పౌరుడిగా భావించలేదు. ఎందుకంటే మీ తల్లి ఇటలీ నుంచి వచ్చారు కాబట్టి"
- ప్రగ్యా ఠాకూర్, బీజేపీ ఎంపీ
Also Read: రైతుల ఆత్మహత్యలు కొత్తేమీ కాదు, ఏటా జరుగుతూనే ఉంటాయ్ - మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!
Petrol-Diesel Price 31 March 2023: సాధారణ జనానికి ఊరట, ఇవాళ కొంచం తగ్గిన చమురు ధరలు
Gold-Silver Price 31 March 2023: నగలు కొందామంటే భయపెడుతున్న బంగారం ధర, ఇవాళ కూడా పెరిగిన రేటు
BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్
Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు