Virat Kohli restaurant: కోహ్లి రెస్టారెంట్‌లో నాలుగు కార్న్ ముక్కలు 500 పైనే - కస్టమర్ అసంతృప్తి - సోషల్ మీడియా రియాక్షన్ ఏమిటంటే ?
Virat Kohli: సెలబ్రిటీలు ప్రారంబించే రెస్టారెంట్లు సామాన్యుల కోసంకాదు. ధన వంతుల కోసమే. మరోసారి విరాట్ కోహ్లీ రెస్టారెంట్ సిస్టమ్ అదే నిరూపిస్తోంది.
Virat Kohli: విరాట్ కోహ్లీకి దేశవ్యాప్తంగా రెస్టారెంట్స్ ఉన్నాయి. వాటి పేరు వన్ 8 కమ్యూన్. ఇటీవల హైదరాబాద్‌లో కూడా దీన్ని ప్రారంభించారు. విరాట్ కోహ్లీపై అభిమానమో లేకపోతే రెస్టారెంట్ లో తిండి బాగుంటుందని అనుకుంటారో కానీో ఈ రెస్టారెంట్లకు మంచి ఆదరణ ఉంటుంది. అయితే సహజంగానే రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా ఓ యువతి విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కు వెళ్లింది. స్టార్టర్ గా.. భుట్టా అనే పదార్థాన్ని ఆర్డర్ చేసింది. భుట్టా అంటే.. నాలుగు కార్న్ ముక్కలు ఉడికించినవి. వాటి ఫోటో తీసి..తాను ఈ భుట్టా కోసం.. రూ. 525 రూపాయలు చెల్లించానని పోస్టు పెట్టారు.
paid rs.525 for this today at one8 commune 😭 pic.twitter.com/EpDaVEIzln
— Sneha (@itspsneha) January 11, 2025
అమె పోస్టు చూసి భిన్నంగా స్పందిస్తున్నారు. ఇందులో ఎక్కువగా విరాట్ కోహ్లీకి మద్దతుగా పోస్టులు ఉన్నాయి. ఆ ధర పెట్టింది కేవలం ఆ ఒక్క పదార్థానికి కాదని.. మీరు అత్యంత సౌకర్యవంతమైన , లగ్జరీ ప్లేస్ లో కూర్చున్నాని మంచి లైవ్ మ్యూజిక్ సహా అనేక సౌకర్యాలు కల్పించారని అందులో అన్నీ కలిపి ఉంటాయని ఓ నెటిజన్ గుర్తు చేశారు.
You paid for the “community” One8 has created :) ~ the people hanging around, the music, the vibe … coming from the high rent, higher than average staff salary, etc etc etc
— Akshay Chaturvedi (@Akshay001) January 12, 2025
మరో నెటిజన్.. ఏమీ తెలియకుండానే అక్కడకు వెళ్లి ఆర్డర్ చేశారా.. దాని రేటు అక్కడ అంతే ఉంటుందని తెలిసి కూడా ఆర్డర్ చేసి ఎందుకు ఇలా పోస్టు పెడుతున్నారని ప్రశ్నించారు. [
Healthy choice Sneha.
— Prashanth (@YVPRASH) January 12, 2025
70% cost goes for the plating and the ambience.
15% cost goes for the serving
15% is the real cost.
Worth it, in my opinion.
Money is Ambience, Service & Cleanliness . That comfy chair, good looking rich ppl around, nice crockeries.
— Samiran Ghosh (@samiranghosh87) January 12, 2025
Isn’t it ?
Get the same thing in Thela for 30Rs.
Choice is Urs.
మరికొంత మంది సెలబ్రిటీలు తమ పేరును ఉపయోగించుకుని ఇలాంటి వాటి ద్వారా మరింత ఎక్కువగా సంపాదించుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. అయితే మరికొంత మంది కస్టమర్లు కూడా.. .వన్8 కమ్యూన్ రేట్లు పెట్టినంత హై స్టాండర్డ్ తో లేదని అంటున్నారు.
I just didn’t like the place. Firstly, they have some issue with chappals (Birkenstocks).
— Shachi (@ShachiGambhir) January 11, 2025
Second, every single dish we had was underwhelming. The price didn’t justify the product.