అన్వేషించండి
Indian Railway: దివ్యాంగులకు రైల్వేశాఖ తీపికబురు- ఆన్‌లైన్‌లోనే పాసుల జారీ, ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం
Disabled People Pass: దివ్యాంగుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించింది.ఇందులో పాసుల జారీతోపాటు ఆన్‌లైన్‌లో ఈ-టిక్కెట్ బుకింగ్ సౌకర్యం కల్పించింది.

దివ్యాంగులకు ఆన్‌లైన్‌లో రైల్వేపాసులు
Source : X
Railway Pass: దివ్యాంగులకు భారత రైల్వే తీపి కబురు అందించింది.ఇకపై రైల్వేపాసు(Railway Pass)ల కోసం రైల్వే కార్యాలయాలు, స్టేషన్లు చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లోనే పోందే ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రైల్వేశాఖ వెబ్‌సైట్(Website) ప్రారంభించింది.
ఆన్‌లైన్‌లో రైల్వేపాసులు
దివ్యాంగులు( Disabled People),ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ప్రభుత్వం రాయితీపై ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. రైళ్లు(Rail), బస్సుల్లో వారికి ప్రత్యేక సీట్లు కేటాయింపుతోపాటు...ఛార్జీల్లోనూ రాయితీ ఇస్తోంది. అయితే ఈ పాసులు తీసుకోవాలంటే సంబంధిత పత్రాలు పట్టుకుని రైల్వేస్టేషన్(Railway Station)కు వెళ్లాలి.తెలియనివారు, పూర్తిగా నిరక్షరాస్యులు ఉంటే...అక్కడి,ఇక్కడికి అధికారులు తిప్పుతూ ఉంటారు. పైగా ఒకసారి వెళితే పని జరగదు. పలుమార్లు తిప్పించుకుంటారు. రైల్వేస్టేషన్ ఉన్న ఊరు అయితే పర్వాలేదు..లేదంటూ పల్లెలు,మారుమూల గ్రామాల నుంచి స్టేషన్లు చుట్టూ తిరగాల్సి వస్తుంది.అలాగే ఇలాంటి రైల్వేపాసులు...సాధారణ స్టేషన్లలో ఇవ్వరు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ వంటి పెద్దస్టేషన్లలోనే ఇస్తారు.
వాటికోసం పలుమార్లు స్టేషన్ల చుట్టూ తిరగడం దివ్యాంగులకు చాలా ఇబ్బంది. అసలే అంగవైకల్యంతో బాధపడుతున్న వారు...ఇలా రైల్వేపాసుల కోసం స్టేషన్ల చుట్టూ తిరగడం ఇబ్బందికరపరిస్థితే. అయితే ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవు.. ఆన్‌లైన్(Online)లోనే పాసు పొందడానికి రైల్వేశాఖ ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించింది. అందులోనే ఈ- టికెట్లు బుక్ చేసుకునే విధానాన్నికూడా తీసుకొచ్చారు.
దివ్యాంగులు ఇకపై ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా పాసులు పొందవచ్చు. http:///divyangjanid.indianrail.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి పాసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడే మీకు యూనిక్ డిజబులిటీ ఐడీకార్డు మంజూరు చేస్తారు. నూతన పాసులు(New Pass) కావాల్సిన వారితోపాటు పాత పాసులు రెన్యూవల్ చేయించుకోవాల్సిన వారు సైతం ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. అలాగే దివ్యాంగులు ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లోనే పాసు ఐడీ కార్డును తీసుకోవచ్చు. కొత్త పాసు తీసుకోవల్సిన వారు...తొలుత పేరు,ఆధార్‌కార్డు(Aadhar) నెంబర్, ఫోన్‌నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ కోసం పోన్ నెంబర్‌తోపాటు వచ్చిన ఓటీపి(OTP) ఎంటర్ చేసుకోవాలి. ఇలా ఎన్నిసార్లు అయినా లాగిన్ అయి..మన దరఖాస్తు పరిశీలించుకోవచ్చు.
దివ్యాంగులకు తప్పిన కష్టాలు
ఒకప్పుడు దివ్యాంగులు రైల్వేపాసు తీసుకోవాలంటే నెలల తరబడి వేచి ఉండాలి.రైల్వే స్టేషన్లు చుట్టూతిరగాల్సి వచ్చేది. రైల్వే అధికారులు కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో..డివిజన్ కార్యాలయాల్లో పడిగాపులు కాయాల్సి వచ్చేది.ఇప్పుడు అవన్నీ ఏం లేకుండానే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించడంపై దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాసులు పునరుద్ధరణ
కొవిడ్‌కు ముందు రైల్వేశాఖలో చాలా కేటగిరిలకు పాస్‌సౌకర్యం ఉండేది. కానీ కొవిడ్ మహమ్మరి దెబ్బకు రైల్వేశాఖలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా రైళ్లు నిలిచిపోవడంతో పాసుల జారీ నిలిపివేశారు. చాలా మార్గాల్లో ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి కొన్నేళ్లపాటు కేవలం ఎక్స్‌ప్రెస్,సూపర్‌ఫాస్ట్ రైళ్లను మాత్రమే నడిపారు.ఆ క్రమంలో పాసులను రెన్యూవల్ చేయలేదు. ఆ తర్వాత అతి కొద్ది కేటగిరిలకు మాత్రమే తిరిగి పాసులు పునరుద్ధరిస్తున్నారు. రైల్వేపాసులో దివ్యాంగులతోపాటు వారికి తోడుగా వెళ్లేవారికి సైతం సగం ఛార్జీ మాత్రమే వసూలు చేస్తారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఆటో





















