అన్వేషించండి

AI Project: 48 గంటల్లోనే క్యాన్సర్‌కు చెక్ - ఓపెన్‌ ఏఐ, సాఫ్ట్‌బ్యాంక్‌, ఒరాకిల్‌ సంయుక్తంగా భారీ ప్రాజెక్టు

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త కంపెనీ ద్వారా కృత్రిమ మేథస్సు మౌలిక సదుపాయాలలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించారు. క్యాన్సర్ నివారణకు ఓ భారీ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నాయి.

Cancer Vaccine With AI Support: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త కంపెనీ ద్వారా కృత్రిమ మేథస్సు (AI) మౌలిక సదుపాయాల్లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించారు. దీన్ని ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ AI భాగస్వామ్యంతో ప్లాన్ చేస్తున్నారు. ఇది ఐటీ రంగంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ప్రాజెక్టు అవుతుందని తెలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీలన్నీ కలిసి ప్రపంచంలోనే అద్భుతమైన కృత్రిమ మేథ (AI) ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాణాంతక క్యాన్సర్‌ను గుర్తించి, 48 గంటల్లోనే వ్యాక్సిన్‌ అందించడమే లక్ష్యంగా ఉంది. ట్రంప్‌ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.

‘స్టార్‌గేట్‌’ ప్రాజెక్ట్ ఆరంభం
‘స్టార్‌గేట్‌’ పేరుతో ఈ వెంచర్‌ను ప్రారంభించినట్టు ట్రంప్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 500 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా టెక్సాస్‌లో ఇప్పటికే 10 డేటా సెంటర్లను నిర్మించారు. త్వరలో ఈ సంఖ్యను 20కి పెంచనున్నారు. అమెరికా డేటా సెంటర్లలో టెక్నాలజీ కంపెనీలు చేసే గణనీయమైన పెట్టుబడులకు గుర్తుగా ఉంటుంది. ఈ మూడు కంపెనీలు ఈ వెంచర్‌కు ఆర్థిక సహాయం అందించాలని యోచిస్తున్నాయి. ఇతర పెట్టుబడిదారులు కూడా ఇందులో పెట్టుబడి పెట్టగలరు. ఇది టెక్సాస్‌లో నిర్మించబడుతున్న 10 డేటా సెంటర్లతో ప్రారంభమవుతుంది. మంగళవారం వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్, ఒరాకిల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లారీ ఎల్లిసన్, సాఫ్ట్‌బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మసయోషి సన్,  ఓపెన్ ఏఐ సీఈవో  సామ్ ఆల్ట్‌మాన్‌లతో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు.

లక్ష మందికి పైగా ఉద్యోగాలు 
"ఆ పేరును మీ పుస్తకాల్లో రాసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు దాని గురించి చాలా వింటారని నేను భావిస్తున్నాను" అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికాలో ఏఐ మౌలిక సదుపాయాలలో అమెరికా  500 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టి, వేగంగా అభివృద్ధి చెంది, తక్షణమే 100,000 కంటే ఎక్కువ అమెరికన్ ఉద్యోగాలను సృష్టించే కొత్త అమెరికన్ కంపెనీ అవుతుందన్నారు.

ఏఐ సాయంతో క్యాన్సర్‌కు పరిష్కారం
ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాజెక్ట్ లక్షలాది ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా, క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి, వేగవంతంగా నయం చేయడానికి సహకరించనుంది’’ అన్నారు.

వ్యాక్సిన్ తయారీలో కొత్త యుగం
ఒరాకిల్‌ సీటీఓ ల్యారీ ఎల్లిసన్ ఈ ప్రాజెక్టుతో క్యాన్సర్ చికిత్సలో ఎలా మార్పు వస్తుందో వివరించారు. ‘‘రక్తంలో తేలియాడే చిన్న ట్యూమర్స్‌ను ఏఐ సాయంతో ముందుగానే గుర్తించవచ్చు. దీనివల్ల రక్త పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను శీఘ్రంగా నిర్ధారించవచ్చు. అలాగే, ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా రూపొందించిన టీకాను 48 గంటల్లోనే తయారు చేయవచ్చు’’ అని వెల్లడించారు.

అమెరికా స్వర్ణయుగానికి నాంది
సాఫ్ట్‌బ్యాంక్‌ సీఈఓ మసయోషి సన్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాజెక్ట్‌ అమెరికాను కొత్త స్వర్ణయుగంలోకి తీసుకెళ్తుంది. కృత్రిమ మేధ సాయంతో ప్రజల ఆరోగ్య సమస్యలకు వేగంగా పరిష్కారాలు లభిస్తాయి’’ అన్నారు.

మహత్తర ప్రాజెక్టు ప్రయోజనాలు
ఈ ప్రాజెక్ట్‌ ద్వారా కేవలం క్యాన్సర్‌ చికిత్సే కాదు, ప్రపంచ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు కలగనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. టెక్నాలజీ వినియోగంతో వ్యక్తిగత ఆరోగ్య సేవలలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ ప్రాజెక్టు టెక్నాలజీ రంగంలోనే కాదు, ఆరోగ్య రంగంలోనూ అద్భుత మార్పుల్ని తీసుకురానుంది.

Also Read: Donald Trump: 'అమెరికాకు సమర్థులు రావాలని కోరుకుంటున్నా' - హెచ్ 1బీ వీసాలపై అధ్యక్షుడు ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget