Breaking News Live Updates: నల్గొండలో రథోత్సవంలో అపశ్రుతి, విద్యుత్ తీగలు తాకడంతో ముగ్గురు మృతి
Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE

Background
Nalgonda Crime: రథోత్సవంలో అపశ్రుతి, విద్యుత్ తీగలు తాకడంతో ముగ్గురు మృతి
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతెపల్లిలో రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తాకడంతో ముగ్గురు భక్తులు మరణించగా, మరో నలుగు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
వైసిపి ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తున్నా: అన్నాబత్తుని శివకుమార్
గుంటూరు జిల్లా, తెనాలిలో గాంధీ చౌక్ లో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్,
బీసీ అధ్యక్షుడు కేశన.శంకర్రావు,తదితరులు. వైసిపి ఎమ్మెల్యే గా ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. ఎన్టీఆర్ సామాజిక విప్లవ వాది. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం తీసుకొచ్చింది ఎన్టీఆరే. ఎన్టీఆర్ తర్వాత పాలించిన వారు సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కారు. తిరిగి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేస్తుంది జగన్ మోహన్ రెడ్డే. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేది జగన్ నాయకత్వంలోని వైసిపినే అని పేర్కొన్నారు.
ఎన్ టి ఆర్ ను స్ఫూర్తిగా తీసుకోని కేసీఆర్ నడుస్తున్నారు: మోత్కుపల్లి
భూ స్వాములు పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్ టి ఆర్ అని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. పెంకుటు ఇల్లు పరిచియం చేసిందీ మహ నాయకుడు, ఎన్ టి ఆర్ ను స్ఫూర్తిగా తీసుకోని కేసీఆర్ నడుస్తున్నారని చెప్పారు. మధ్య దళారులు లేకుండా ప్రజలకి అన్ని చేరుకోవాలి. ఈ దళిత బంధు కూడా అలాంటిదేనన్నారు. వాస్తవానికి పెళ్లి నాటికి అర్థ రూపాయ లేదని.. తన పెళ్లి కి వచ్చి భోజనం చేసి నన్ను ముందు ఉండి నడిపిన వ్యక్తి ఎన్ టి ఆర్ అని గుర్తుకు చేసుకున్నారు మోత్కుపల్లి.
NTR Birth Anniversary: ప్రపంచ ఖ్యాతి గడించిన తెలుగు బిడ్డ ఎన్టీఆర్: మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి: ఒక తెలుగు బిడ్డ ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్. టి. అర్
- అయన అదేశాలు మేరకు అభిమానులు పని చేస్తున్నారు
- అయన ప్రధాని మంత్రి అవ్వాల్సింధి.. జస్ట్ లో మిస్స్ అయింది
- ఎన్. టి.అర్ కి భారత రత్న ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం
RGV Complaint In Punjagutta PS: నట్టి క్రాంతి, నట్టి కరుణపై పంజాగుట్ట పీఎస్లో RGV ఫిర్యాదు
హైదరాబాద్: నట్టి క్రాంతి, నట్టి కరుణ పై పంజాగుట్టలో టాలీవుడ్ డైరెక్టర్ Rgv ఫిర్యాదు చేశారు. తన సైన్ ను ఫోర్జరీ చేశారు అని పోలీసులకు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఇష్టం సినిమాకు సంబంధించిన లేటర్ రేట్ పై తన సంతకం ఫోర్జరీ చేశారు అని rgv ఆరోపించారు. నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఫిర్యాదు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

